క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారా..అయితే డైట్‌లో వీటిని చేర్చాల్సిందే?

ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లను ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు.

ఈ ప్రాణాంత‌క వైర‌స్ దెబ్బ‌కు ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.

మ‌రెంద‌రో ప్రాణాల‌తో పోరాడుతున్నారు.ఇక ప్ర‌స్తుతం క‌రోనాను నివారించేందుకు ప్ర‌పంచ‌దేశాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభించాయి.

అన్ని దేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది.అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో జ్వ‌రం, ఒళ్లు నొప్పులు, త‌ల‌నొప్పి ఇలా ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

వీటిని అదిగ‌మించి మ‌ళ్లీ ఆరోగ్యంగా మారాలంటే.ఖ‌చ్చితంగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రి వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద‌యాన్నే నాన బెట్టిన నాలుగు లేదా ఆరు బాదం ప‌ప్పుల‌తో పాటు కొన్ని ఎండు ద్రాక్ష‌ల‌ను తీసుకోవాలి.

ఇవి నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి శ‌రీరానికి త‌గినంత శ‌క్తిని అందిస్తాయి.

"""/" / అలాగే బ్రేక్ ఫాస్ట్‌లో ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఓట్స్ తీసుకుంటే మంచిది.

వ్యాక్సిన్‌ తర్వాత సూప్స్ ఎక్కువ‌గా తీసుకోవాలి.చికెన్ సూప్ లేదా వెజిటేబుల్‌తో త‌యారు చేసిన సూప్స్ తీసుకోవాలి.

మొలకల సలాడ్‌, కూరగాయలు పప్పుతో కిచిడి వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.వ్యాక్సిన్ వేయించుకున్న వారు జీల‌క‌ర్ర‌, మిరియాలు, పుదీనా మ‌రియు నిమ్మ ర‌సం వంటి వాటిని ఖ‌చ్చితంగా ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.

సాయంత్రం స‌మ‌యంలో గుమ్మడి గింజలు, వాల్‌నట్స్‌, ఖర్జూరాలు తీసుకోవాలి.అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారి డైట్‌లో పండ్లు త‌ప్ప‌కుండా ఉండాలి.

ముఖ్యంగా కివి పండు, దానిమ్మ‌, పుచ్చ కాయ, యాపిల్ వంటివి తీసుకోవాలి.ఇక ప్ర‌తి రోజు నిద్రించే గంట ముందు.

ఒక గ్లాస్ పాల‌లో చిటికెడు ప‌సుపు క‌లిపి తీసుకోవాలి.వ్యాక్సిన్ త‌ర్వాత శ‌రీర వేడికి దారి తీస్తుంది.

అందువ‌ల్ల‌, మంచి నీటితో పాటు కొబ్బ‌రి నీళ్లు, మ‌జ్జిగ‌, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే వేడి తగ్గుతుంది.

‌.

నా జీవితంలో దానికి తావు లేదు.. హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!