పాలిచ్చే త‌ల్లులు ఈ ఆహారాలు తింటే..చాలా డేంజ‌ర‌ట‌!

ప్ర‌స‌వానికి ముందే కాదు.ప్ర‌స‌వానికి త‌ర్వాత కూడా త‌ల్లులు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ముఖ్యంగా పాలిచ్చే త‌ల్లులు ఆహారం విష‌యంలో అనేక నియ‌మాలు పాటించాల్సి ఉంటుంది.లేదంటే త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రూ ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంది.

అందుకే పాలిచ్చే త‌ల్లులు స‌రైన ఫుడ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అలాగే కొన్ని కొన్ని ఆహారాల‌కు దూరంగా కూడా ఉండాలి.

అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు చూసేయండి.వెల్లుల్లి తింటే పాలు బాగా ప‌డ‌తాయ‌ని పెద్ద‌లు చెబుతుంటారు.

ఈ క్ర‌మంలోనే పాలిచ్చే త‌ల్లుల‌కు వెల్లుల్లి పెడుతుంటారు.కానీ, త‌ల్లులు వెల్లుల్లి తీసుకోవ‌డం వ‌ల్ల‌.

అందులో ఉండే అల్లిసిన్ అనే కంటెంట్ పాల వాస‌న‌ను మార్చేస్తుంది.అలా వాసన వచ్చే పాలను పిల్లలు తాగేందుకు నిరాక‌రిస్తుంటారు.

అందుకే త‌ల్లులు వెల్లుల్లికి దూరంగా ఉండ‌టం మంచిది.అలాగే పాలిచ్చే త‌ల్లులు దూరంగా ఉండాల్సిన ఆహారాల్లో క్యాబేజీ ఒక‌టి.

అవును, త‌ల్లులు క్యాబేజీ తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

మ‌రియు పిల్ల‌ల‌కు కూడా జీర్ణ స‌మ‌స్య‌లు ఏర్ప‌డతాయి.పాలిచ్చే త‌ల్లులు పొర‌ పాటున కూడా కాఫీ జోలికి పోకూడ‌దు.

కాఫీలో ఉండే కెఫిన్ త‌ల్లికి, బిడ్డ‌కు ఇద్ద‌రికీ డేంజ‌రే.కాబ‌ట్టి, ఎంత ఇష్ట‌మున్నా.

పాలిచ్చే త‌ల్లులు కాఫీకి దూరంగా ఉండాల్సిందే. """/" / పాలిచ్చే తల్లులు నివారించాల్సిన ఆహారాల్లో సిట్రస్ పండ్లు కూడా ఉన్నాయి.

సిట్ర‌స్ పండ్లు తీసుకోవ‌డం వ‌ల్ల పాల‌లో ఆమ్లత్వం పెరుగుతుంది.ఆ పాలు తాగ‌డం వ‌ల్ల పిల్లల్లో కడుపు నొప్పి, విరేచనాలు వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

ఇక శిశువుకు పాలిచ్చే సమయంలో పుదీనాను అస్స‌లు తీసుకోరాదు.ఎందు కంటే, పుదీనా పాల ఉత్ప‌త్తిని త‌గ్గించేస్తుంది.

దాంతో మీ పిల్ల‌లు ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.

ఎన్ఆర్ఐలకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారు..: కొడాలి నాని