అర్ధరాత్రి ఆకలి వేస్తోందా..ఇవి తీసుకుంటే బెటర్?
TeluguStop.com
సాధారణంగా అర్ధ రాత్రి పూట ఆకలి వేస్తోంది.ముఖ్యంగా బరువు తగ్గేందుకు డైటింగ్ చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక ఆ అర్ధరాత్రి సమయంలో ఏం తినాలో తిలియక సతమతమవుతుంటారు.ఏదో ఒకటి తినేద్దామని అనుకుంటే.
బరువు పెరిగిపోతారేమోనన్న భయం వెంటాడుతుంది.పోని అలానే నిద్ర పోదామా అంటే అస్సలు నిద్ర పట్టదు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు తీసుకుంటే ఆకలి తీరుతుంది.బరువూ పెరగరు.
మరి ఆ ఆహారాలు ఏంటో ఆలస్యం చేయకుండా చూసేయండి.సాధారణంగా టీవీ చూసే సమయంలో లేదా ఖాళీ ఉన్న సమయంలో చాలా మంది పాప్ కార్న్ తింటుంటారు.
అయితే పాప్ కార్న్‌ను మిడ్ నైట్ మీల్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.అవును, అర్థరాత్రి బాగా ఆకలి వేస్తుంటే పాప్ కార్న్ తీసుకుంటే ఆకలి తీరుతుంది.
లేదంటే మరమరాలను కూడా తీసుకోవచ్చు.ఇవి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారన్న భయం ఉండదు.
పైగా వీటిని తీసుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది. """/" /
అలాగే అర్ధరాత్రి ఆకలి వేస్తే ఒక కప్పు పెరుగు తీసుకోవడం కూడా బెస్ట్ అప్షన్ అని చెప్పాలి.
పెరుగును తీసుకోవడం వల్ల ఆకలి ఇట్టే తీరుతుంది.పైగా నిద్ర కూడా బాగా పడుతుంది.
లేదంటే పండ్లను కూడా మిడ్ నైట్ మీల్‌గా ఎంచుకోవచ్చు.ఇంట్లో ఉండే ఏదో ఒక పండును తీసుకోవచ్చు.
కానీ, సిట్రస్ స్థాయిలు ఎక్కువగా ఉండే నారింజ, ద్రాక్ష, పైనాపిల్ పండ్లను మాత్రం ఎవాయిడ్ చేయాలి.
సూప్స్ తయారు చేసుకోవడం ఈజీ, అందువల్ల, అర్థరాత్రి ఆకలి వేస్తే వేడి వేడిగా సూప్స్ తయారు చేసుకుని తీసుకోవచ్చు.
ఇక రాగి చిప్స్, ఓట్స్, తృణధాన్యాలు, కాయధాన్యాల, ఎండు కర్జూరాలు వంటి కూడా మిడ్ నైట్ తీసుకోవచ్చు.
అయితే పిజ్జా, బర్గర్, కేకులు, స్పైసీ ఫుడ్ వంటివి మిడ్ నైట్ అస్సలు తీసుకోరాదు.
చిన్నారి గుండె ఆగింది.. 8 ఏళ్లకే గుండెపోటుతో బాలిక మృతి.. స్కూల్‌లోనే విషాదం..!