రాత్రిపూట ఈ ఆహారాలు తీసుకుంటే.. మీ ఆరోగ్యం పదిలం!
TeluguStop.com
పగటి పూట ఎలాంటి ఆహారం, ఎంత ఆహారం తీసుకున్నా ఏదో ఒక పని చేస్తారు కాబట్టి త్వరగా జీర్ణం అయిపోతుంటుంది.
కానీ, రాత్రి పూట అలా కాదు.నిద్రించడం తప్ప ఎలాంటి శారీర శ్రమ ఉండదు.
అందుకే రాత్రి పూట తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం.మితంగా తీసుకోవడమే కాదు త్వరగా జీర్ణం అయ్యే మరియు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలి.
మరి ఏ ఏ ఆహారాలు రాత్రి వేళ తీసుకుంటే.మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది రాత్రి పూట పాలు తాగడానికి ఇష్టపడరు.కానీ, కొవ్వు తీసిన పాలను షుగర్ లేకుండా రాత్రి పూట తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ చురుగ్గా సాగుతుంది.
మరియు మీ నరాలు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లడంతో పాటు మంచి నిద్ర పడుతుంది.
అలాగే ఎండు కర్జూరాలను కూడా రాత్రి పూట తీసుకోవచ్చు.ఎండు కర్జూరాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
మార్నింగ్ సిక్ నెస్‌ను కూడా ఎండు కర్జూరాలు తగ్గిస్తాయి. """/"/
చాలా మందికి సినిమా చూసే సమయంలో లేదా ఖాళీగా ఉన్న సమయంలో పాప్ కార్న్ తినడం అలవాటు.
అయితే రాత్రి పూట కూడా పాప్ కార్న్ తినొచ్చు.పాప్ కార్న్ మంచి నిద్రను అందించడంతో పాటు మెటబాలిజం రేటు కూడా పెంచుతుంది.
అలాగే రాత్రి వేళ అల్లం టీని కూడా తీసుకోవచ్చు.కానీ, పాలు, షుగర్ లేకుండా తీసుకోవాలి.
అల్లం టీ తీసుకోవడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.
తీసుకున్న ఆహారం కూడా ఫాస్ట్‌గా జీర్ణం అవుతుంది. """/"/
ఇక మలబద్ధకం సమస్యతో బాధ పడే వారు రాత్రి పూట ఒక ఆరెంజ్ పండు తీసుకుంటే.
మరుసటి రోజు ఫ్రీ మోషన్ అవుతుంది.వాల్ నట్స్‌ను కూడా రాత్రి పూట తీసుకోవచ్చు.
వీటిని రాత్రి పూట తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.వీటితో పాటుగా సూప్స్, బ్రౌన్ రైస్, గ్రీన్ టీ, ఓట్స్, చపాతీ, అరటి పండు వంటివి కూడా తీసుకోవచ్చు.
అచ్చం మనిషిలాగే ఉన్నాడు.. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో నిద్రపోతున్న విగ్రహం చూస్తే గుండె గుభేల్!