వేస‌విలో ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగ‌తులు..జాగ్ర‌త్త‌!

వేస‌వి కాలం వ‌చ్చేసింది.భానుడు నిప్పులు కురిపించేందుకు రెడీ అయ్యాడు.

మెల్ల మెల్ల‌గా ఎండ‌లు ప్రారంభం అవుతున్నాయి.మొన్నామధ్య రెండు రోజులు కాస్త చ‌ల్ల‌గా ఉన్నా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి.

రానున్న రోజుల్లో ఎండ‌లు మ‌రింత ముద‌ర‌నున్నాయి.ఇక ఈ వేస‌వి కాలంలో ఎండ తీవ్ర నుంచి త‌ప్పించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో స‌రైనా ఆహారాల‌ను ఎంపిక చేసుకుని తీసుకోవాలి.అలాగే ఎంత ఆరోగ్యానికి మేలు చేసిన‌ప్ప‌టికీ కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో నుంచి క‌ట్ చేసుకోవాలి.

ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.వేరుశెనగలువీటితో చ‌ట్నీ చేసుకుని తిన‌డం లేదా వేయించుకుని తిన‌డం చేస్తుంటారు కానీ, వేస‌విలో వేరుశెన‌గ‌ల‌ను ఎవైడ్ చేయిడ‌మే మంచిది.

ఎందుకంటే, వేరుశెన‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక దాహం క‌లుగుతుంది.మ‌రియు శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే గుణం కూడా వేరుశ‌న‌గ‌ల‌కు ఉంటుంది.

"""/"/ మెంతికూర, మునగాకు, తోట‌కూర వంటి ఆకుకూర‌ల‌ను కూడా వేసవి కాలంలో ఎంత త‌క్కువ‌గా తీసుకుంటే అంత మంచిది.

ఎందుకంటే, ఇవి శ‌రీరంలో మ‌రింత వేడిని పెంచి చికాకును క‌లిగిస్తాయి.అలాగే రెడ్ మీట్‌, రొయ్య‌లు, గుడ్లు, చికెన్ వంటి వాటికి కూడా వేస‌విలో దూరంగా ఉండాలి.

ఎందుకంటే, వీటి వ‌ల్ల బాడీలో హీట్ పెర‌గ‌డంతో పాటు జీర్ణ స‌మ‌స్యలు కూడా ఎక్కువ‌గా వ‌స్తాయి.

"""/"/ చాలా మంది బ‌రువు త‌గ్గేందుకు చ‌పాతీలు తింటుంటారు.కానీ, గోధుమ పిండితో త‌యారు చేసే ఈ చ‌పాతీలు ఒంట్లో వేడిని పుట్టిస్తాయి.

మ‌రియు త‌ల‌నొప్పి, తీవ్ర‌మైన చెమ‌ట‌లు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేలా చేస్తాయి.ఇక వీటిలో పాటు ఆయిలీ పుడ్స్‌, జంక్ ఫుడ్స్, ఫ్రిజ్ వాటర్, ఆల్కహాల్, అల్లం, నల్లమిరియాలు, టీ, కాఫీ, ఐస్ క్రీములు, స్పైసీ ఫుడ్స్ వంటి వాటికి కూడా ఈ స‌మ్మ‌ర్‌లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఆస్ట్రేలియా బౌలర్లకు తాట తీసిన జైస్వాల్.. దిగ్గజాల సరసన చోటు