ఉంగరం వేలుతోనే ఎందుకు బొట్టు పెట్టుకోవాలి?

ఉంగరం వేలుతోనే ఎందుకు బొట్టు పెట్టుకోవాలి?

హిందువులు నుదిటిపై బొట్టు పెట్టుకోవడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.విష్ణు భక్తులు చందనం, శివ భక్తులు విభూది, దేవి భక్తులు సిందూరం ధరిస్తారు.

ఉంగరం వేలుతోనే ఎందుకు బొట్టు పెట్టుకోవాలి?

అయితే చాలా మంది నుదుటి రెండు కనుబొమల మధ్య ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటారు.

ఉంగరం వేలుతోనే ఎందుకు బొట్టు పెట్టుకోవాలి?

అయితే ఉంగరం వేలు కాకుండా మిగతా వేళ్ళతో బొట్టు పెట్టుకుంటే ఏమి అవుతుందో తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయాలు మరియు పురాణాల ప్రకారం మధ్య వేలు శని స్థానం.ఈయన జీవితానికి భద్రత కలిగిస్తాడు.

కాబట్టి మధ్యవేలితో నుదుటిపై బొట్టు పెట్టుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.ఉంగరపు వేలు సూర్య స్థానం.

అందుకే ఈ వేలుతో నుదుటన బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి కలగటమే కాకూండా నుదుటిపై ఉండే ఆఙ్ఞా చక్రం ఉత్తేజితమై, మనిషి మేధస్సును మేల్కొల్పడానికి సహాయపడుతుంది.

అందుకే దేవుడికి ఈ వేలుతోనే తిలకధారణ చేస్తారు.హిందూ సంప్రదాయాలు మరియు పురాణాల ప్రకారం బొటన వేలు శుక్ర స్థానం.

ఈ గ్రహం ఆరోగ్యం ప్రసాదిస్తుంది.కాబట్టి బొటనవేలుతో బొట్టు పెట్టుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి.

చూపుడు వేలు బృహస్పతి స్థానం.అమరత్వాన్ని కలిగించేది బృహస్పతి గ్రహం.

మరణించిన వారికి మాత్రం ఈ వేలుతో తిలకం దిద్దితే మోక్షం ప్రాప్తిస్తుంది.అందుకే మిగతా సందర్భాల్లో చూపుడువేలుతో నుదుటిపై బొట్టు పెట్టడాన్ని అపవిత్రంగా భావిస్తారు.

అంతేకాక చూపుడు వేలుతో ఏ పని చేయటానికి కూడా ఇష్టపడరు.మానవ శరీరంలోని మొత్తం 13 ప్రదేశాల్లో తిలకధారణ చేయవచ్చు.

కానీ నుదుటిపై బొట్టుపెట్టుకోవడమే అత్యంత పవిత్రంగా భావిస్తారు.

ఫేస్ మొత్తం టాన్ అయిందా.. 20 నిమిషాల్లో రిపేర్ చేసుకోండిలా..!