అలాంటి మాస్కులు ధ‌రించినా నో యూజ్.. బ‌య‌టప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి అల్ల‌క‌ల్లోలం చేస్తున్న విష‌యం తెలిసిందే.చైనాలో పురుడు పోసుకున్న ఈ క‌రోనా వైర‌స్‌.

కంటికి క‌నిపించ‌కుండా దేశ‌దేశాలకు పాకేసి అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు ప్ర‌భుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

మొద‌ట లైట్ తీసుకున్న ప్ర‌జ‌లు.ఇప్పుడు క‌రోనా పేరు విన‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.

ల‌క్ష‌ల మంది ప్రాణాలు బ‌లితీసుకున్న క‌రోనా.ఎప్పుడు అంతం అవుతుందో అంతుచిక్క‌డం లేదు.

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కరోనా వైర‌స్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న మార్గాల్లో ప్రధానమైనది మాస్క్ ధరించడం.

మాస్కు ధరించడం వ‌ల్ల‌ మనల్ని మనం రక్షించుకోవడం తో పాటు ఇతరులకు కూడా రక్షణ క‌ల్పించిన‌ట్టు అవుతుంది.

అందుకే ప్ర‌భుత్వాలు, నిపుణులు ప‌దే ప‌దే మాస్కు ధ‌రించ‌మ‌ని చెబుతున్నారు.ఇక మాస్క్‌ ధ‌రించ‌డ‌మే కాదు.

ఎలాంటి మాస్క్‌లు ధరించాచాలి అన్న‌ విష‌యం కూడా ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి. """/" / అయితే ఇటీవ‌ల అమెరికా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జ‌రిపిన ఓ పరిశోధనలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

ఎలాంటి మాస్క్‌లు క‌రోనా నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి అన్న అంశంపై ప‌రోధ‌న చేయ‌గా.

కరోనా వ్యాప్తి కారక తుంపర్లను నిరోధించడానికి వాల్వ్‌లు లేని ఎన్‌–95 మాస్క్‌లే అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని గుర్తించారు.

ఆ త‌ర్వాత త్రీ లేయర్‌ మాస్క్‌లు మంచివని వారి ప‌రిశోధ‌న‌లో తేలిసింది.అలాగే కాటన్-పాలిప్రోలిన్-కాటన్‌ మాస్క్‌లు‌ మూడోస్థానంలో, టూ లేయర్‌ పాలిప్రోపిలిన్‌ ఏప్రాన్‌ మాస్క్‌లు‌ నాలుగో స్థానంలో నిలిచాయ‌ని వారు వెల్ల‌డించారు.

అయితే వదులైన బట్టతో చేసినవి, ఫేస్‌ కవరింగ్స్‌ వంటివి మాస్క్‌లు ధ‌రించ‌డం వ‌ల్ల ఎలాంటి యూజ్ లేద‌ని తేల్చారు.

అలాంటి మాస్కులు పెట్టుకున్నా.పెట్టుకోలేక‌పోయినా ఒక‌టే అని పేర్కొన్నారు.

సో.బీకేర్‌ఫుల్‌!.

వైరల్ వీడియో: ఏంటి భయ్యా.. బతికున్న నల్లత్రాచుకు నేరుగా పూజలు చేస్తున్న కుటుంబం..