2024 ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేస్తారో.. క్లారిటీ ఇచ్చిన లోకేష్..!!

2019 ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు వారసుడిగా పార్టీ ఎమ్మెల్సీ పదవి చేపట్టిన లోకేష్ అనతికాలంలోనే మంత్రి అయ్యారు.

అనంతరం పార్టీలో కీలకంగా వ్యవహరించిన లోకేష్ గత సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందారు.

దీంతో నారా లోకేష్ మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీచేసి ఓడిపోవడంతో ఆయనపై భారీ స్థాయిలో ప్రత్యర్థుల నుండి విమర్శలు వస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో లోకేష్ కుప్పం నుండి పోటీ చేస్తున్నట్లు.

ఇంకా రకరకాల నియోజకవర్గాల పేర్లు కూడా వినబడుతున్నాయి.కానీ తాజాగా మళ్లీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడు తాజాగా చేపట్టిన 36 గంటల దీక్ష నేపథ్యంలో.వైసిపి పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.

వచ్చే ఎన్నికలలో మంగళగిరిలో పోటీచేసి.ఎమ్మెల్యేగా గెలిచి టిడిపికి కానుకగా ఇస్తా అని స్పష్టం చేశారు.

ఖచ్చితంగా చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసులకు భయ పడాల్సిన అవసరం లేదని.

లోకేష్ భరోసా ఇచ్చారు.కేవలం వైసీపీకి ట్రైలర్ మాత్రమే ప్రస్తుతం చూపించడం జరిగింది అని.

రాబోయే రోజుల్లో సినిమా చూపిస్తామని.వార్నింగ్ ఇచ్చారు.

బరువు తగ్గి స్లిమ్ గా మారాలనుకుంటున్నారా.. అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇది ఉండాల్సిందే!