ఈ విశ్వంలో అత్యంత అందమైన అమ్మాయిలు ఉండేది అక్కడేనట?
TeluguStop.com
అందానికి మనిషి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రని తిరగేస్తే యుద్ధాలు అందం కోసమే జరిగాయని మనకి ఇట్టే బోధపడుతుంది.
ఇప్పటికీ కూడా వివాహల్లో వధూవరుల అందాన్నే ప్రధానంగా చూస్తారు.అంతెందుకు మనం ఏ వస్తువు పట్లైనా, మనుషుల పట్లైనా అందం వుంటేనే వెంటనే ఆకర్షితులం అవుతాము.
అయితే ఈ క్రమంలో మనలో చాలమందికి అసలు ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్కడుంటారనే సందేహం ఎన్నోసార్లు వచ్చే ఉంటుంది కదా.
"""/" /
ఈ నేపధ్యంలోనే మనకు అనేక ప్రదేశాల పేర్లు ప్రధానంగా వినబడుతూ వుంటాయి.
ఆర్మేనియా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని కొంతమంది చెబుతూ వుంటారు.అదేవిధంగా తుర్కియా దేశపు అమ్మాయిల( Turkey ) అందం అయితే కట్టి పాడేస్తుందని చెబుతుంటారు.
కానీ అత్యంత అందమైన అమ్మాయిలు మన పక్కనున్న పాకిస్తాన్‌లో ఉంటారని తాజా సర్వేలు చెబుతున్నాయి.
షాకింగ్ కదా.మీరు అస్సలు ఊహించి వుండరు కదా.
అవును, పాకిస్తాన్( Pakistan )లో హుంజా వ్యాలీ( Hunza Valley ) అనే ప్రదేశం ఉంది.
అక్కడ మహిళలు 80 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా కనిపిస్తారని సమాచారం.
/br> """/" /
ఒక్క అందమే కాదండోయ్, ఆరోగ్యంగా కూడా ఉంటారట.60 ఏళ్లు దాటిన తర్వాత కూడా తల్లులయ్యే సామర్థ్యం వీరికి మెండుగా వుంటుండట.
అందుకు కారణం వారి జీవనశైలి అని చెబుతున్నారు.అందుకే ఇక్కడి మహిళలు వందేళ్లకు పైగా జీవిస్తున్నారు.
వీరికి రోగాలు రావట! ఎప్పుడో కానీ అనారోగ్యానికి గురి కారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీనికి కారణమేమో ఇక్కడ ప్రవహించే నదిలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఖనిజాలు అత్యధికంగా వుండడమేనట.
అంతేకాకుండా హుంజా వ్యాలీ ప్రజలు మిత ఆహారం తీసుకుంటారు.మధ్యాహ్నం ఓసారి మాత్రమే భోజనం చేస్తారు.
ఇక్కడి ప్రజలు ఇక్కడివారినే పెళ్లి చేసుకుంటారు.ఇంకా స్వచ్ఛమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుని దాన్నే తింటారు.
హుంజా వ్యాలీ( Hunza Valley ) ప్రజలు మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు.
ఈ కారణాల వల్లనే వారు నిత్య యవ్వనంగా వుంటారని వినికిడి.
యవ్వనంగా కనిపిస్తున్న ఈమె వయసు తెలిస్తే షాకే.. ఆమె తినేది ఏంటంటే..?