వేర్ ఈజ్ వరంగల్ శ్రీను..?
TeluguStop.com
దిల్ రాజుకి పోటీగా నైజాం లో డిస్ట్రిబ్యూటర్ గా హడావిడి చేశాడు వరంగల్ శ్రీను.
దిల్ రాజుతో ప్రత్యక్ష యుద్ధానికే దిగిన అతను భారీ సినిమాలు కొనేసి లాసులు తెచ్చుకున్నాడు.
ముఖ్యంగా ఆచార్య( Acharya ) లైగర్ సినిమాలు భారీ మొత్తం పెట్టి కొన్న వరంగల్ శ్రీను ఆ సినిమాల వల్ల భారీ నష్టాల పాలయ్యాడు.
"""/" /
అందుకే లైగర్ తర్వాత వరంగల్ శ్రీను( Warangal Srinu ) అసలు కనిపించడం లేదు.
నైజాం డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు తన చేతుల్లో తీసుకున్నాడని అతని మీద కామెంట్స్ చేసిన శ్రీను ఇప్పుడు వార్తల్లో లేకుండా పోయాడు.
"""/" /
వరంగల్ శ్రీను కి లాసులు వచ్చిన మాట వాస్తవమే.దిల్ రాజు ( Dil Raju )కూడా కెరీర్ కొత్తల్లో భారీ లాసులు చూశాడు కానీ అక్కడితో ఆగిపోకుండా మళ్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చాడు.
కానీ వరుసగా రెండు ఫ్లాపులు పడగానే వరంగల్ శ్రీను సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఆపేసినట్టు తెలుస్తుంది.
భారీ సినిమాలు కాకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాలైనా వరంగల్ శ్రీను కొంటే బెటర్ అని అంటున్నారు.
లైగర్ లాసుల గురించి పూరీతో గొడవకు దిగినట్టు ప్రచారంలోకి రాగా ఆ తర్వాత వరంగల్ శ్రీను కనిపించకుండా ఉన్నారు.
తండ్రి చెప్పినట్టే సౌందర్య కెరీర్.. ఆమె జీవితంలో ఈ షాకింగ్ విషయాలు తెలుసా?