‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఎక్కడుందంటే?
TeluguStop.com
తెలుగు ఇండస్ట్రీలో కిరణ్ అబ్బురవరం(kiran Abburavaram) హీరోగా నటించిన ‘క’ (KA) సినిమా మొదటి రోజు నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు ఇప్పటివరకు ఏకంగా 19.41 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది.
బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్(HIT TALK) తో చాలా వేగంగా దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమాకు సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా చేసిన సంగతి అందరికీ వివిధమే.
అయితే ఈ ‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఉంది.క సినిమాలో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి అవుతుందని చూపించిన విధంగానే ఓ గ్రామం నిజంగానే ఉంది.
అది ఎక్కడో కాదు మన తెలంగాణలోని పెద్దపల్లికి(Peddapalli) 10 కిలోమీటర్లలో ఉన్న ఆ ఊరిని 'మూడు జాముల కొదురుపాక'(Mudujamula Kodurupaka) అని అందరూ అంటారు.
"""/" /
ఆ ఊరిలో ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు జాములే ఉంటాయి.
సాయంత్రం నాలుగు గంటలకే అక్కడ చీకటి అవుతుంది.దీనికి కారణం నాలుగు దిక్కులా ఎత్తైన కొండలు.
మధ్యలో ఊరు ఉండడంతో సూర్యుడు కొండల వెనకాల వెళ్లి ఆ నీడ పడి త్వరగా ఆ ఊరు చీకటిలో ఉంటుంది.
అంతేకాకుండా, ఈ గ్రామంలో సూర్యాస్తమం కూడా కాస్త ఆలస్యంగా జరుగుతుందని అక్కడి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.
ఎత్తైన పాము బండ గుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉండడం వల్ల ఆ కొండల సూర్యరశ్మికి అడ్డంగా పడతాయి.
ఈ ప్రకృతికి అలవాటు పడిన అక్కడ గ్రామస్తులు వారి జీవనాన్ని సుఖంగా కొనసాగిస్తూ ఉన్నారు.
ఇక ఆ ఊరికి కొత్తగా వెళ్లినవారు అందరూ వాతావరణన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
ఓరి దేవుడా.. కళ్ళు సీసాలో ప్రత్యక్షమైన కట్లపాము