బలమయిన జనసేన మద్దతు స్వరం ఎక్కడ ?

కళ్యాణ్ దిలీప్ సుంకర( Kalyan Dilip Sunkara ) అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు.

హైకోర్టు లాయర్ గా లోన్ యాప్ ల కేసులో బాధితుల కష్టాలను ప్రపంచం ముందుకు తీసుకువచ్చిన ఈ వకీల్ సాబ్ , పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏకలవ్య శిష్యుడిగా పవన్ అభిమానులకు ఎప్పటినుంచో పరిచయం.

ముఖ్యంగా జనసేన తరుపున బలమైన గొంతుక వినిపించే కళ్యాణ్ దిలీప్ సుంకర, ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పక్షానికి దీటుగా జనసేన( Janasena ) ను నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు.

జనసేన తరఫున మాట్లాడే చాలామంది జనసైనికులకు ఈయన వీడియోలలో మాట్లాడే కంటెంట్ ప్రధాన వనరుగా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు.

అయినా కూడా పార్టీ తరఫున ఈయనకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని ఆవేదనకూడా అయిన కొన్నిసార్లు ఆయన మాటల లో కనిపిస్తూ ఉంటుంది .

"""/" / నిజానికి ఈ స్తాయి వాక్ చాతుర్యం, విషయ పరిజ్ఞానం తో పాటు పుష్కలంగా ధైర్యం ఉన్న వ్యక్తి అధికార పక్షానికి కొమ్ము కాసి ఉంటే ఆయనకు పదవులు క్యూ కట్టి ఉండేవి .

కానీ జనసేన మాత్రం అధికారి ప్రతినిధి పదవి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తొలగించింది .

అయినప్పటికీ కూడా మెగా కుటుంబం మీద ఉన్న విపరీతమైన ఆరాధనతో అనధికారిక ప్రతినిధిగా కొనసాగుతున్న ఈయన తెలుగుదేశం జనసేనల పొత్తుపై తన మనస్సాక్షికి అనుకూలంగా చేసిన కొన్ని వ్యాఖ్యలతో పార్టీకి మరింత దూరమయ్యారు.

పార్టీ నుంచి వచ్చిన అనధికారిక ఆదేశాలతో మనస్తాపం చెందిన ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ తన సొంత యూట్యూబ్ చానెల్ లో రాజకీయానికి సంబంధం లేని విషయాలపై వీడియోలు చేస్తూ ఉన్నారు.

అయితే ఏమైందో ఏమో హఠాత్తుగా కొన్ని రోజుల క్రితం తన చివర శ్వాస వరకూ పవన్ తోనే ఉంటానంటూ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టిన 24 గంటల్లోనే దాన్ని తొలగించి ఫేస్బుక్ నుంచి పూర్తిగా అంతర్దానం అయిపోవడం గమనార్హం .

"""/" / రాజకీయ కారణాలు( Political Reasons ) ఏమున్నా కూడా పార్టీకి హనుమంతుడి లా బలం గా నిలబడిన అసాధారణ ప్రతిభ ఉన్న ఇలాంటి యువనాయకులను పార్టీ ఎందుకు ప్రోత్సహించటం లేదన్నది జనసేనను అభిమానిస్తున్న వేలాది మంది యువకులకు ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మాత్రం మారిపోయింది.

అధికార పక్ష విమర్శలను తిప్పికొట్టడం తో పాటు రాజకీయాలను అభిమానిస్తున్న వేలాది మంది యువకులకు భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై తనదైన స్థాయిలో విశ్లేషణ చేస్తూ గమనం చూపిస్తున్న ఇలాంటి నాయకుడిని పార్టీ దూరం చేసుకుంటున్న విధానంపై మాత్రం చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరి ఉన్నట్టుండి సోషల్ మీడియా నుంచి అదృశ్యమయిపోయిన ఈ యువ నాయకుడు భవిష్యత్తు ప్రయాణం ఏమిటో చూడాలి.

వీరి సినిమాలు ఎంతో బాగుంటాయి కానీ వాటి కోసం కళ్ళు కాసేలా ఎదురు చూడాల్సిందే !