ఇదెక్కడి అన్యాయం సీఎం రావు గారూ?
TeluguStop.com
నల్లగొండ జిల్లా:రావుగారి పాలనలో పైసలు పోతే రానే రావా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాధితుల బంధువు,ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్
ధర్మ లేఖ రాశారు.
ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు,వారసత్వ బదిలీ తదితర సేవలకు యజమానులు మీ సేవా కేంద్రాల ద్వారా స్లాటు నమోదు చేసి సంబంధిత రుసుం చెల్లిస్తున్నారని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
సాగుభూమి లావాదేవీ రద్దయితే సొమ్ములు తిరిగి రావడం లేదని,ఈ చెల్లింపులకు ఖాతాలే లేని విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని, భూముల క్రమబద్ధీకరణ తిరస్కార చలానాల సంగతీ ఏమిటని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.
ప్రజల్ని నిలువున దోచుకునే దోపిడి విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న 9848540078 ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు,వారసత్వ బదిలీ తదితర సేవలకు యజమానులు మీ సేవా కేంద్రాల ద్వారా స్లాటు నమోదు చేసి సంబంధిత రుసుం చెల్లిస్తున్నారు.
ఆ వెంటనే ఫోన్ కు సందేశం వస్తోంది.ఏదైనా కారణంగా లావాదేవీని రద్దు చేసుకున్నప్పుడు కూడా సందేశం వస్తోంది.
ఆ సొమ్ము తిరిగి చెల్లించే ప్రక్రియ మాత్రం పూర్తికావడం లేదని,రెండేళ్లుగా ఆ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న వారూవేల మంది ఉన్నారంటే రాష్ర్టంలోజరుగుతున్న పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని,భూముల క్రమబద్దీకరణ కోసం ఏడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుని,తిరస్కారానికి గురైన వారికీ ఇప్పటివరకూ సొమ్ము తిరిగి రాలేదని ధరణి పోర్టల్ ద్వారా లావాదేవీలు,దరఖాస్తుల తిరస్కరణ,తిరిగి చెల్లింపులకు జవాబుదారీ తనమే లేదని వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుడు ప్రజాహితమే తన హితంగా,కార్మిక కర్షక ప్రజా సమస్యలపై పీడితవర్గాల సమస్యలపై నిరంతరం పోరాడే విప్లవకారుడు,కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న విమర్శించారు.
కనీసం ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ కూడా లేదని,జిల్లా కలెక్టర్లే భూ యజమానులకు తిరిగి చెల్లింపులు చేసేలా ప్రభుత్వం గతేడాది ఆదేశాలు జారీ చేసిందని,అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే చెల్లింపులు జరిగాయని సుభాషన్న పేర్కొన్నారు.
అత్యధిక జిల్లాల్లో ఇప్పటికీ పైసా విడుదల కాలేదని,ఉమ్మడి నల్గొండ,మహబూబ్నగర్,కరీంనగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి,మెదక్ జిల్లాల్లో రీఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారు వేలల్లో ఉన్నారని,డబ్బు కోసం తహసీల్దార్లను కలిస్తే కలెక్టరేట్లకు వెళ్లాలని సూచిస్తున్నారని ప్రజనేస్తం బొరన్నాగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
ఒకటి రెండుసార్లు వెళ్లి దరఖాస్తు చేసుకుని వస్తున్నా ఫలితం ఉండటం లేదని,లావాదేవీ రద్దు చేసుకున్న వారికి వెంటనే ఆ మొత్తం వెనక్కు వచ్చేలా ఏర్పాట్లు చేయాల్సింది పోయి ఇలా ఇబ్బందులకు గురిచేయడం ఏమిటి?" అని బాధితుల గోడును ఆవేదనను విప్లవాల నేతాజీ,ప్రజా ఉద్యమాల బాపూజీ,ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో ముఖ్యమంత్రిని సుభాషన్న ఘాటుగా ప్రశ్నించారు.
మళ్లీ దరఖాస్తు చేసుకున్నా మొత్తం చెల్లించాల్సి వస్తుందని, ప్రతిక్షణం ప్రజాహితం ద్యేయంగా,ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ,సమాజ సమగ్ర అభివృద్ధికై చట్టబద్ధ పాలనకై,ప్రజా సంక్షేమం కోసం ప్రజల పక్షాన కొట్లాడే ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రికి బాధితుల తరపున రాసిన బహిరంగ లేఖలో సుభాషన్న తీవ్రఆవేదన వ్యక్తం చేశారు.
భూ లావాదేవీ(సేల్డీడ్)కి ఏడు నెలల క్రితం 6 శాతం ఛార్జీ ఉండగా,తర్వాత అది 7.
5 శాతానికి చేరిందని,ఏడు నెలల క్రితం లావాదేవీ రద్దు చేసుకున్న వారు తిరిగి సేలీడ్కు దరఖాస్తు చేసుకుంటే సాధారణంగా మిగిలిన 1.
5 శాతం చెల్లిస్తే సరిపోతుంది.కానీ,స్లాటు నమోదు సమయంలో 7.
5 శాతం చెల్లించాలని సూచిస్తుండటంతో వారు అవాక్కవుతున్నారని ఇలా ఎన్నిసార్లు డబ్బులు కట్టాలంటూ,ప్రభుత్వం యొక్క దోపిడీ విధానానికి అంతే లేదా? అంటూ సుభాషన్న పాలకులను ప్రశ్నిస్తూ,ప్రభుత్వ యొక్క నిలువు దోపిడిపై ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న నిప్పులు కురిపించారు.
పేదలు,బలహీనవర్గాలు,దళితులు,మహిళలు,సమస్త పీడిత ప్రజలు అనునిత్యం జీవితంలో ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై వర్గ దోపిడిపై,కుల వివక్షతపై ఎక్కుపెట్టిన బాణం ప్రజా నేస్తం సుభాషన్న,వర్గ దోపిడి గుండెలపై నిరంతర వేటగాడు,పీడిత ప్రజాస్వరం,ప్రజల తరపున ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రి కెసిఆర్కు ఇప్పటికే వెయ్యికి పైగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి బహిరంగ లేఖలు రాయడం జరిగింది.
బాధితుల బంధువుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బోరన్నగారి నేతాజీ సుభాషన్న తాజాగా భూ లావాదేవీల పేరిట జరుగుతున్న దోపిడీ మీద రాసిన లేఖలో ఘాటుగా సుభాషన్న విమర్శించారు.
2014-16 మధ్య ప్రభుత్వం మొదటిసారి ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టిందని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జీవో ఎంఎస్.నం.
59 కింద 125 చ.గజాలకుపైగా ఉన్న భూమిని క్రమబద్ధీకరించేందుకు 17,065 మంది రూ.
446.72 కోట్లు చెల్లించారని,వారిలో 3,145 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
31కోట్లు ఇప్పటికీ చెల్లించలేదని,తాజా క్రమబద్ధీకరణ ప్రక్రియలోనైనా ఆ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అనే విషయం సర్కారు ఎందుకు స్పష్టత ఇవ్వడంలేదని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ప్రభుత్వ దోపిడిని నిలదీశారు.
బాధితుల ఆవేదనను బహిరంగ లేఖలో ప్రజా ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న వినిపించారు.
కలెక్టరేట్లలో చెల్లింపుల ఖాతాలే లేవని ప్రజా ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
వాస్తవంగా భూముల లావాదేవీలు రద్దయిన పక్షంలో సదరు వ్యక్తుల బ్యాంకు ఖాతాకు సొమ్ముచేరేలా ఓ వ్యవస్థ ఉండాలని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
ఇక్కడ అలాంటిదేమీ లేదని,బాధితుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం గతేడు కలెక్టర్లకు చెల్లింపుల అధికారం ఇచ్చినప్పటికీ చాలా జిల్లాల్లో ప్రత్యేక ఖాతాలు తెరవనే లేదని,ఈ కారణంగా బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేకుండా పోతోందని కలెక్టరేట్ల అధికారులుపేర్కొంటున్నారని,ప్రభుత్వ స్థాయిలో ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేసేలా నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమస్యకు మార్గం లభించదని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న 8328277285 తెలిపారు.
ఈ సమస్యపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని,సమస్య పరిష్కారానికి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ప్రజాబంధువు బోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
వైరల్: వధువు డాన్స్ ని మ్యాచ్ చేయాలని నవ్వులపాలైన వరుడు!