ముస్లింలు తయారు చేసే రావణ విగ్రహం ఎక్కడంటే..?
TeluguStop.com
మన దేశ వ్యాప్తంగా దసరా సంబరాలు( Dussehra Celebrations ) ఎంతో ఘనంగా జరిగాయి.
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రజలు విజయదశమిని జరుపుకున్నారు.ఈ పండుగ సందర్భంగా అమ్మవారి రూపాల్లో కొలువైన విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది.
అదే విధంగా కొన్ని ప్రాంతాలలో రావణాసుడి దహన కార్యక్రమం కూడా జరిగింది.ఎలాగైతే అమ్మవారి విగ్రహాలను తయారు చేస్తారో అదే విధంగా రావణాసుడిని విగ్రహాలు కూడా తయారు చేస్తారు.
అలాగే చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతికగా విజయదశమి రోజు రావణాసుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు.
అయితే రావణాసుడి బొమ్మల తయారీలో ఎక్కువగా హిందువులే ఉండడం మనం చూస్తూ ఉంటాం.
"""/" /
కానీ మన దేశంలోని ఈ ప్రాంతంలో మాత్రం ముస్లింలు( Muslims ) రావణ ప్రతిమలను తయారు చేస్తారు.
అంతేకాకుండా పంజాబీ వాసులు ఈ బొమ్మలను దహనం చేస్తారు.మతసామరస్యానికి ప్రతికగా ఈ ప్రాంతంలో దసరా పండుగ జరుపుకుంటారు.
మరి ఈ ప్రాంత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో రావణ దహన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం భారీ ఎత్తున నిర్వహిస్తారు.
దసరా రోజున రావణ దహనం దాని ప్రత్యేకత వైభవాన్ని కలిగి ఉంటుంది.గుజరాత్( Gujarat ) రాష్ట్రవ్యాప్తంగా విజయదశమి పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు.
ఈ పండుగ సందర్భంగా శాస్త్ర పూజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. """/" /
అరోరా పంజాబీ సమాజ్ దసరా రోజు 68వ రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
దీంతో పాటు ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం కూడా నిర్వహిస్తారు.ఈ ఊరేగింపులో పంజాబీ డ్రమ్స్ పై పంజాబీ రాసులు పడడం ఆనవాయితీ.
ఇంకా చెప్పాలంటే ప్రతి సంవత్సరం గుజరాత్ లోని ఈ ప్రాంతంలో ముస్లిం కళాకారులు రావణుడి విగ్రహాలను తయారు చేస్తారు.
ఈ ముస్లిం కళాకారులు యూపీకి చెందిన వారు కావడం విశేషం.యూపీ కి చెందిన ముస్లిం కళాకారులు 51 అడుగుల రావణ విగ్రహాన్ని పూర్తి చేశారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ఆనంద్ వద్దా రావణ విగ్రహాలను ముస్లిం కళాకారులు చాలా ఏళ్లుగా తయారు చేస్తున్నారు.
ఈ కళాకారుల పనిని చూసేందుకు చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తారని చెబుతున్నారు.
రూటు మార్చిన నాని వర్కౌట్ అవుతుందా..?