నేటి ఎన్నికల ప్రచారం : కడప లో షర్మిల .. జగన్ ఎక్కడంటే ?

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు 13 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మరింత స్పీడ్ చేసాయి .

ఏపీ అధికార పార్టీ వైసిపి ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుండగా, టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) లు కూటమిగా ఏర్పడి వైసీపీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలుగా కొన్ని నెలల క్రితమే బాధ్యతలు స్వీకరించిన వైయస్ షర్మిల కూడా దూకుడుగానే వ్యవహరిస్తూ, తన అన్న జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి వైస్ అవినాష్ రెడ్డి పై పోటీ చేస్తున్న షర్మిల, వచ్చే ఎన్నికల్లో ఎంపీ గా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూనే, మరోవైపు కడప పార్లమెంటు నియోజకవర్గం పైన పూర్తిగా షర్మిల ఫోకస్ చేశారు.

"""/" / కడప జిల్లాలో షర్మిల పర్యటన నేటి నుంచి కడప జిల్లాలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) పర్యటించనున్నారు.

కడప పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.

కడప పార్లమెంట్ అభ్యర్థిగా షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు.నేటి నుంచి వరుసుగా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు.

ఈరోజు ఉదయం బద్వేల్ నియోజకవర్గం( Badwel Constituency ) పరిధిలోని కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి కోడూరు, బద్వేల్, అట్లూరు మండలాలలో షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.

కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూనే.ఎంపీగా తనను గెలిపించాలని ప్రజలను కోరనున్నారు.

"""/" / బొబ్బిలిలో జగన్ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఈరోజు ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 కు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పాయకరావుపేటలో జరిగే సభలో జగన్ పాల్గొంటారు.

అనంతరం ఏలూరులో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొని జనాలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు.

మొదటి భర్త గురించి పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేసిన అమలాపాల్.. అసలేమైందంటే?