విరుపాక్ష తర్వాత సంయుక్త మీనన్ కి ఏమైంది ? ఆమె జోరు ఎందుకు తగ్గిపోయింది ?
TeluguStop.com
సంయుక్త మీనన్( Samyuktha Menon ).2016లో పాప్కాన్ అనే ఒక మలయాళ సినిమా ద్వారా వెండితెరపై తొలిసారిగా కనిపించింది.
ఒకటి రెండు తమిళ సినిమాలు చేసిన ఆమెకు వరుసగా మలయాళ సినిమాల్లో మాత్రమే ఆఫర్స్ వచ్చాయి.
పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసేంత వరకు కూడా తెలుగులో ఆమె ఎక్కడా కనిపించలేదు.
ఆ తర్వాత ప్రభంజనంలా ఆమె సినిమాలు వచ్చాయి.ఒకేసారి ఏకంగా మూడు వరస విజయాలను దక్కించుకొని హత్యకు హీరోయిన్ గా సంయుక్తమైన అందరి చేత లక్కీ హీరోయిన్ అనిపించుకుంది.
అయితే ప్రస్తుతం సంయుక్త మీనన్ ఏమైపోయింది ? ఏ సినిమాలు చేస్తుంది ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
"""/" /
పవన్ కళ్యాణ్ భిమ్లా నాయక్ సినిమాలో చాలా తక్కువ అయినప్పటికీ మంచి పాత్ర పోషించింది.
ఈ సినిమా 2022లో రాగా అదే ఏడాది కళ్యాణ్ రామ్ సరసన బింబి సారా ( Bimbisara )చిత్రంలో నటించింది.
ఒకే ఏడాదిలో ఈ రెండు సినిమాలు విజయం సాధించడం సంయుక్త మీనన్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మార్గాన్ని సుగమం చేశాయి.
కళ్యాణ్ రామ్ కూడా చాలా ఏళ్లుగా ఒక విజయం కోసం పరితపిస్తుండగా ఈ సినిమా అతనికి ఎంతగానో ఉపయోగపడింది.
ఇక ఆ తర్వాత 2023లో మరోసారి సార్ సినిమాతో విద్వంసం సృష్టించింది సంయుక్త.
ఈ సినిమా ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కగా నేరుగా తెలుగులోనే విడుదల అయింది.
ఇక ఇది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. """/" /
ఈ సినిమా తర్వాత సంయుక్త సాయి ధరం తేజ్ హీరోగా విరూపాక్ష సినిమా( Virupaksha )లో నటించింది.
ఇక ఈ సినిమాలో ఆమె నటన మరో రేంజ్ లో ఉందని చెప్పొచ్చు సాయిధరమ్ తేజ్ ని కూడా పక్కన పెట్టేంతగా ఈ సినిమాలో సంయుక్త పర్ఫామెన్స్ ఇచ్చి పడేసింది.
దీని తర్వాత ఆమె కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు.అయితే కళ్యాణ్ రామ్ తోనే డెవిల్ అనే మరో సినిమాతో ప్రేక్షకులకు పలకరించగా ఇది డిజాస్టర్ ఫలితాన్ని అందించింది.
ఈ చిత్రం తర్వాత మళ్లీ సంయుక్త మీనన్ ఎక్కడా కనిపించలేదు ప్రస్తుతం నిఖిల్ హీరోగా స్వయంభు అనే సినిమాలో నటిస్తున్నప్పటికీ సంయుక్త మీనన్ గురించి దాదాపు అందరూ మర్చిపోయారు.
ఎందుకంటే కాస్త గ్యాప్ వచ్చింది అంటే చాలు కొత్త హీరోయిన్స్ పుట్టుకొస్తున్నారు.గత ఆరు నెలలుగా ఈ అమ్మడు ఎక్కడ సందడి చేయకపోవడంతో సంయుక్త ఉందా లేదా అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.
తమిళంలో గేమ్ ఛేంజర్ హిట్టవ్వడం సాధ్యమేనా.. అక్కడ ఏం జరుగుతుందో?