కనిపించడం లేదు కానీ ప్రశాంత్ కిషోర్ చాలానే చేస్తున్నాడు
TeluguStop.com
ఎన్నికలు వస్తున్నాయి అంటే దేశ వ్యాప్తంగా ఎక్కడ అయినా కూడా ప్రశాంత్ కిషోర్( Prashanth Kishore ) పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అనడంలో సందేహం లేదు.
గత ఎన్నికల సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )గెలిచి సీఎం అవ్వడానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ యొక్క రాజకీయ వ్యూహాలు అంటూ చాలా మంది అంటూ ఉంటారు.
దాదాపు రెండు సంవత్సరాల ముందు నుండే ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ జగన్ ( Jagan )కు మద్దతు దక్కేలా చేశాడు.
పాదయాత్ర సమయంలో ఎలా వ్యవహరించాలి.మీటింగ్స్ లో ఎలా వ్యవహరించాలి ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ వైకాపా ను గైడెన్స్ చేస్తూ వచ్చింది.
ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ టీమ్ పని చేస్తోంది అనేది కొందరి వాదన.
"""/" /
ఆ విషయమై క్లారిటీ లేదు.కానీ ఈమధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ కనిపించక పోవడంతో ఆయన ఈ మధ్య కాలంలో తన కార్యక్రమాలను పక్కన పెట్టాడా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కానీ అసలు విషయం ఏంటీ అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన టీమ్ ఏదో ఒక పార్టీ కోసం పని చేస్తూనే ఉంది.
కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా ఆయన స్థాపించిన ఐ ప్యాక్ సంస్థ విస్తరిస్తూ ఉంది.
ఇటీవల చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పై జరిగిన రాళ్ల దాడి విషయం లో కూడా ఐ ప్యాక్ హ్యాండ్ ఉంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు.
ఒక వ్యక్తిని ఐ ప్యాక్ వ్యక్తిగా గుర్తించినట్లుగా కొందరు పేర్కొంటున్నారు.ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
మొత్తానికి ప్రశాంత్ కిషోర్ కనిపించడం లేదు కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా కార్యక్రమాలనే చేస్తున్నాడు అంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
How Modern Technology Shapes The IGaming Experience