ఎన్టీఆర్ దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా.. అభిమానులకు తీపికబురు ఇదే!
TeluguStop.com
జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తాజాగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న చిత్రం కావటంలో దేవర పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
దానికి తోడు ఇప్పటికే దేవర సినిమా( Devara ) నుంచి విడుదలైన లుక్స్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
"""/" /
సెప్టెంబర్ 27, 2024 న రిలీజ్ అవబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దానికీ తోడు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం.
కాగా దేవర మూవీలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు.
అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల తెలిపారు.
"""/" /
అందుకే రెండు పార్ట్ లుగా దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు.
ఇకపోతే దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్( Devara Pre-Release Event ) కర్నూల్ లో( Kurnool ) జరగనుందట.
బారీగా అక్కడ ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.అయితే ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారనే సమయం మాత్రం బయిటకు రాలేదు.
ఇదే నిజమైతే రాయలసీమ మొత్తాన్ని కర్నూల్ రిప్రజెంట్ చేసినట్లు ఉంటుందని అంటున్నారు.అలాగే సీడెడ్ లో ఎన్టీఆర్ కు స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది.
అక్కడ తారక్ సినిమాలు అనేక రికార్డ్ లు క్రియేట్ చేసాయి.ఆ బంధం ఈవెంట్ తో మరింత బలపడుతుంది.
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్‌గా పూజా