హలో బిగ్‌బాస్‌.. మసాలా ఎక్కడ?

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది.భారీ స్థాయిలో విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో రెండవ సీజన్‌పై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా షోను మరింత మసాలా అంటూ ప్రారంభిస్తున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు.

నాని హోస్ట్‌గా చేస్తున్న ఈ బిగ్‌బాస్‌లో ముందు నుండి చెబుతూ వస్తున్నట్లుగా మసాలా పెద్దగా ఏమీ అనిపించడం లేదు.

ఇప్పటికే సగం సీజన్‌ అయ్యింది.50 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా ఇంకా అసలు మజా ప్రారంభం అయినట్లుగా అనిపించడం లేదు.

చిన్న చిన్న గొడవలు, తిట్టుకోవడాలు తప్ప గేమ్‌లో అసలు కిక్‌ మొదలు కాలేదు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ బిగ్‌బాస్‌లో ప్రతి వారం ఎలిమినేషన్‌కు నామినేషన్‌ పక్రియ చాలా విభిన్నంగా ఉండాలి.

కాని తెలుగు బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్‌ పక్రియ చాలా సాదా సీదాగా సాగుతుంది.ఏమాత్రం ఆసక్తిని కలిగించేలా నామినేషన్స్‌ జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు విసుగు చెందుతున్నారు.

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేషన్స్‌కు సంబంధించి ఒక సింపుల్‌ గేమ్‌ను పెట్టారు.ఆ గేమ్‌ ప్రకారం ఇంటి సభ్యులు వారిని 1 నుండి 12 వరకు ఏ సంఖ్యలో ఊహించుకుంటున్నారో ఆ నెంబర్‌ వద్ద నిల్చోవాల్సి ఉంటుంది.

బిగ్‌బాస్‌ ప్రకటించిన వెంటనే ఇంటి సభ్యులు గార్డెన్‌ ఏరియాలో ఉన్న నెంబర్స్‌ వద్దకు చేరుకున్నారు.

వారికి అనుకున్న రీతిలో నెంబర్‌ బోర్డు వద్ద నిల్చుకున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తనీస్‌ మొదటి బోర్డు వద్ద నిల్చుండగా చివరి బోర్డు వద్ద పూజా రామచంద్రన్‌ నిల్చుంది.

మూడవ బోర్డు వద్ద కౌశల్‌ మొదట నిల్చుండగా, ఆ తర్వాత కొంత సమయంకు తాను కూడా మూడవ నెంబర్‌ వద్ద నిల్చుంటాను అంటూ దీప్తి వచ్చింది.

అక్కడ ఇద్దరు కొద్ది సమయం చర్చించుకున్నారు.అయినా ఇద్దరి మద్య ఒప్పందం కుదరక పోవడంతో చివరకు ఇద్దరు 3నే ఎంపిక చేసుకున్నట్లుగా ప్రకటించారు.

ఏడు నుండి పన్నెండు వరకు నెంబర్‌లను ఎన్నుకున్న సభ్యులు బాబు గోగినేని, గణేష్‌, నందిని, గీత, పూజా రామచంద్రన్‌లను ఎలిమినేట్‌కు నామినేట్‌ అయినట్లుగా బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

మూడవ నెంబర్‌ వద్ద ఇద్దరు ఉన్నారు కనుక దీప్తి మరియు కౌశల్‌ను కూడా నామినేట్‌ చేసినట్లుగా బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

గీతా మాధురి కెప్టెన్‌ కారణంగా మరోసారి ఆమె సేఫ్‌ అయ్యింది.ఎలిమినేషన్‌ పక్రియకు నామినేషన్స్‌ అంటే చాలా ఆసక్తికరంగా, మసాలా ఉండాలి.

కాని బిగ్‌బాస్‌ నిర్వాహకులు పెద్దగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా అనిపించడం లేదు.మసాలా నిన్నటి ఎపిసోడ్‌లో ఏమాత్రం కనిపించలేదు.

ఈసారి ఇంకాస్త మసాలా అంటూ మొదటి నుండి ప్రచారం చేస్తూ వచ్చిన నిర్వాహకులు చివరకు వచ్చేప్పటికి ఇలా సాదా సీదాగా పూర్తి చేస్తున్నారు.

ఇది ఏమాత్రం ప్రేక్షకులకు రుచించని విషయం.ఇక ఇంట్లోకి నూతన్‌ నాయుడు మరియు శ్యామలలు రీ ఎంట్రీ ఇస్తారు అంటూ ప్రకటించారు.

అది ఎప్పుడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.