ఇంతకు ‘అనగనగా ఒకరాజు’ ఎక్కడ ఉన్నాడు?

నవీన్ పొలిశెట్టి ( Naveen Polishetty )జాతిరత్నాలు సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

హీరో గా నవీన్ ఓ రేంజ్ లో విజయ్ దేవరకొండ దూసుకు పోతాడు అని అంతా భావించారు.

అనుకున్నట్లుగానే వరుస సినిమాలకు కమిట్ అయిన నవీన్ పొలిశెట్టి కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యం అయింది.

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి( Miss Shetty Mr Polishetty ) అనుష్క వల్ల ఏకంగా రెండు సంవత్సరాల సమయం తీసుకుంది.

ఇక అదే సమయంలో ప్రారంభించిన అనగనగా ఒక రాజు సినిమా మాత్రం ఇప్పటి వరకు కనిపించడం లేదు.

అసలు ఆ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. """/" / హీరో గా నవీన్ పొలిశెట్టి తో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్ వారు మొదలు పెట్టిన సినిమా అది.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఇప్పటి వరకు అసలు సినిమా వస్తుందనే నమ్మకం కూడా లేకుండా పోయింది.

ఇప్పుడు జాతిరత్నాలు సినిమా వల్ల వచ్చిన క్రేజ్ కూడా తగ్గింది.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సూపర్ హిట్ అయితే తప్ప నవీన్ పొలిశెట్టికి ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది.

"""/" / అందుకే కచ్చితంగా నవీన్ పొలిశెట్టి ఈ సినిమా తో విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు వెంటనే అనగనగా ఒక రాజు సినిమా ( Anaganaga Ok Raaju )తో రావాల్సిన అవసరం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారీ ఎత్తున అంచనాలు ఉన్న మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్‌ విడుదల అయిన తర్వాత కొందరు పెదవి విరుస్తున్నారు.

ఇలాంటి కాన్సెప్ట్‌ తో సినిమా వస్తుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ విమర్శిస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులకు ఈ కాన్సెప్ట్‌ ఎక్కుతుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఆ సినిమా సంగతి పక్కన పెడితే అనగనగా ఒక రాజు సినిమా పరిస్థితి ఏంటి అనేది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టాక్ ను బట్టి, ఫలితాన్ని బట్టి ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

ఆ ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్లకు సరెండర్ అయితేనే వాళ్ళకి సూపర్ సక్సెస్ లు వస్తాయా..?