తీసిన 4 సినిమాల్లో 2 పవన్ సినిమాలు.. అయినా కూడా అడ్రస్ లేని టాలీవుడ్ డైరెక్టర్

ఒక్కో సారి కాలం కలిసి రాకపోతే ఎంత మంది పెద్ద అవకాశం ఉన్న కూడా ముందుకు సాగలేం.

అలాంటి పరిస్థితి టాలీవుడ్ లో రెండు సార్లు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన ఒక దర్శకుడికి జరిగింది.

అతడే డాలీ అలియాస్ కిషోర్ కుమార్ పార్దాసాని.మొదట్లో వి వి వినాయక్, నల్లమలుపు బుజ్జి వంటి దర్శకులతో రూమ్ షేర్ చేసుకున్నాడు డాలీ.

ఇక ఈ రూమ్ ని పుష్పక విమానం అనే వారు.ఎందుకంటే అక్కడే చాల మంది దర్శకులు అయ్యారు.

ఆ రూమ్ లో ఎవరు దిగిన సినిమల్లో ఛాన్స్ వస్తుందని నమ్మేవారు.అలా పుష్పక విమానం లో అడుగుపెట్టి నిజంగానే సినిమా ఇండస్ట్రీ కి వచ్చేసాడు.

వినాయక్ కి స్క్రిప్ట్ వర్క్ లో డాలీ బాగా సహాయం చేసేవాడు.ఇక తొలిసారి ఆనందం మూవీ కోసం శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసాడు.

ఆలా ఇండస్ట్రీ లో పరిచయాలు పెంచుకొని మొదట సిద్ధార్థ్ మరియు తమన్నా తో కొంచం ఇష్టం కొంచం కష్టం అనే సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా మంచి పోసిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక ఈ చిత్రంలో బ్రహ్మానందం గచ్చిబౌలి దివాకర్ పాత్ర బాగా వర్క్ అవుట్ అయ్యింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకోవడం తో చాల అవకాశాలు అతడికి క్యూ కట్టాయి.

కానీ ఫ్యామిలీ చిత్రం తీసాక ఒక భిన్నమైన సినిమా తీయాలని అనుకున్న డాలీ అందుకు తగ్గట్టుగా బెల్లం కొండా సురేష్ నిర్మాణంలో తడాఖా సినిమా తీసాడు.

"""/"/ ఇది కమర్షియల్ గా పర్వాలేదు అనిపించినా అంత బాగా వర్క్ అవుట్ కాలేదనే అనుకోవాలి .

ఆ తర్వాత వెంకటేష్ మరియు పవన్ కళ్యాణ్ లను హీరోలుగా పెట్టి ఓహ్ మై గాడ్ కి రీమేక్ గా గోపాల గోపాల అనే సినిమాను తీయగా ఇది కూడా మంచి ప్రజాదరణ పొందింది.

ఇక ఈ సినిమా విడుదల అవ్వకముందే పవన్ కళ్యాణ్ కి కాటమ రాయుడు సినిమా కోసం ఒప్పించాడు.

ఇది తమిళ సినిమా వీరమ్ కి రీమేక్ కాగా, ఇది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా నిలిచింది.

ఇలా 13 ఏళ్లలో తీసిన నాలుగు సినిమాల్లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు తీసిన ఆ తర్వాత డాలీ ఎక్కడ కూడా మళ్లీ కనిపించలేదు.

ఇంకా పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్న డాలీ మళ్లీ సినిమా తీయకండా ఏమై పోయాడా అనేది తెలియాల్సి ఉంది.