సన్నాఫ్ ఇండియా డైరెక్టర్ ఏమైపోయాడు.. పవన్‌తో సినిమా చేసేనా?

డైమండ్ రత్నబాబు( Diamond Ratna Babu ) కథ రాసి డైరెక్ట్ చేసిన యాక్షన్ డ్రామా మూవీ "సన్నాఫ్ ఇండియా (2022)"( Son Of India ) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు దీన్ని ప్రొడ్యూస్ చేశాడు.

ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు,( Mohan Babu ) మీనా, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

థియేటర్లలో విడుదలై అన్నీ నెగిటివ్ రివ్యూస్ అందుకుంది. """/" / ఈ సినిమా తర్వాత మోహన్ బాబును చాలా మంది ట్రోల్ చేశారు.

ఈ మూవీని ట్రోల్ చేసినట్లు బహుశా ఏ తెలుగు మూవీని కూడా చేసి ఉండరు.

ఈ విమర్శల నడుమ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు చాలా సైలెంట్ అయిపోయాడు.ఆ తర్వాత ఆయన ఏమైపోయారో కూడా ప్రేక్షకులు తెలుసుకోలేకపోయారు.

నిజానికి ఈ సినిమా తర్వాత డైమండ్ రత్నబాబు అన్‌స్టాపబుల్ (2023)( Unstoppable ) పేరుతో ఒక కామెడీ డ్రామా ఫిలిం చేశాడు.

ఇందులో వీజే సన్నీ, సప్తగిరి, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి వంటి ప్రముఖులు నటించారు.

దీన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు కానీ థియేటర్‌కి వెళ్లి చూసేంత కొత్త స్టోరీలైన్‌తో ఈ మూవీ రాలేదు.

రొటీన్ స్టోరీ, వీక్‌ స్క్రీన్ ప్లే కారణంగా ఈ ఫిల్మ్ పెద్ద హిట్ కాలేదు.

అందువల్ల అతను ఈ సినిమా చేశాడని కూడా ఎవరికీ తెలియదు. """/" / నిజానికి సన్నాఫ్ ఇండియా సినిమా షూటింగ్ సమయంలో డైమండ్ రత్నబాబు బండ్ల గణేష్‌ను కలిసాడు.

ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కోసం ఒక కథ రాసుకున్నట్లు బండ్ల గణేష్‌కు( Bandla Ganesh ) చెప్పాడు.

ఆ సినిమాకు టైటిల్ "మెకానిక్"."రాష్ట్రం రిపేర్‌కు వచ్చింది" అనేది ట్యాగ్ లైన్.

సినిమా స్టోరీని బండ్ల గణేష్ కి వినిపించక ఒకసారి పవన్ కళ్యాణ్ కలవండి బ్రదర్ అంటూ ఆయన సలహా ఇచ్చాడు.

ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ ఇండియా ఫెయిల్ అయింది.దీంతో పవన్ కళ్యాణ్ తో సినిమా అవకాశం అతడికి లేకుండా పోయింది.

ఒకవేళ ఈ మూవీ మంచి హిట్ సాధించినట్లయితే కొంచెం ఆలస్యమైనా ఈ దర్శకుడితో సినిమా తీయడానికి పవన్, బండ్ల గణేష్ ముందుకు వచ్చి ఉండేవారు.

డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారకముందు మూడు సినిమాలకు కథలు రాసి ఇచ్చాడు.అవి షేర్, లక్కున్నోడు, గాయత్రీ.

ఈ సినిమాలు కూడా పెద్దగా హిట్ సాధించలేదు.అతను బుర్రకథ సినిమాతో దర్శకుడిగా అవతరించాడు దాని తర్వాత సన్నాఫ్ ఇండియా డైరెక్ట్ చేశాడు.

ఇవేమీ కూడా అతనికి ఒక్క విజయం సాధించి పెట్టలేదు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?