అభ్యర్థుల మార్పులు సరే – అభివృద్ధి సంగతి ఏమిటి జగన్!

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఘన విజయాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( CM Jagan ) ఎన్నికల కేంద్రంగా అనేక సమూల మార్పులకు నాంది పలికిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా వ్యతిరేకతను ఎదుర్కుంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులను తొలగించడం తో పాటు కొంతమంది నియోజకవర్గాలను మార్చడం, మరి కొంతమందిని పార్లమెంటుకు పంపించడం వంటి మార్పులు, చేర్పులతో పాటు సామాజిక సమకరణాలను కూడా లెక్కలోకి తీసుకొని కొంతమంది కొత్త అభ్యర్థులకు కూడా స్తానం కల్పిస్తున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా ప్రజల్లో ప్రధానంగా ఆ పార్టీ పరిపాలనలో ఎదుర్కొంటున్న సమస్యలకు మాత్రం ఏ రకమైన పరిష్కారాలను ఇప్పటివరకు ప్రకటించకపోవడంగమనార్హం.

ముఖ్యంగా వైసీపీ ( YCP ) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలులో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ అవి సమాజంలో కొన్ని వర్గాలకు మాత్రమే అందుతున్న విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తుంది.

ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పథకాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు.

మౌలిక సదుపాయాల కల్పన లోనూ ముఖ్యంగా గ్రామీణ రహదారులు( Rural Roads ) అస్తవ్యస్తంగా మారిపోవడంతో సాధారణ ప్రజలలో ఈ విషయంలో చాలా వ్యతిరేకత ఉంది.

ఇప్పటికీ రాష్ట్రంలో 60 నుంచి 70% గ్రామాలకు రహదారి మరమ్మతులు చేయలేదు. """/" / ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనం గానే ఉంది.

మరోపక్క పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో వెనకబడి ఉంది.ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపించే చెప్పుకోదగ్గ పరిశ్రమలు( Industries ) ఏవీ వైసిపి హయాంలో రాలేదు.

ప్రబుత్వం పంచి పెడ్తున్న డబ్బులు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమాత్రం సరిపోవు.

వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారి జీవన ప్రమాణాలు వారంతట వారే మెరుగుపరుచుకొంటారు.

"""/" / ఆ విషయంలో మాత్రం వైసిపి ప్రభుత్వానికి మైనస్ మార్కులు పడుతున్నాయి.

దానికి తోడు సమాజంలో కొన్ని వర్గాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ కొన్ని వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి కూడా వైసిపి హయాంలో బాగా పెరిగింది.

దీనిని బ్యాలెన్స్ చెయ్యడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఇలా కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తూ అభ్యర్థుల విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తూ తీసుకుంటే నిర్ణయాలు ఏమాత్రం ఫలితం ఇస్తాయో అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకం గానే మారింది.

సూర్య కంగువ సినిమాలో ఎన్ని పాత్రల్లో నటిస్తున్నాడో తెలుసా..?