భువనగిరి పట్టణాభివృద్ధి ఎక్కడ?

యాదాద్రి జిల్లా:భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ హాజరై,వార్డుల పర్యటన చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వార్డులో జలీల్ పుర మరియు హైదరాబాద్ చౌరస్తా నల్గొండ చౌరస్తా మార్గమధ్యలో మురికి కాల్వల నిర్మాణం సరిగ్గా లేక మురికి నీళ్లు రోడ్లపై నుండి పారుతూ ఇండ్ల ముందు నుండి మురికి నీళ్లు ప్రవహిస్తున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

వంజరి వాడలో పురాతనమైన మురికి కాల్వలు తప్ప నూతనంగా మురికి కాలువలు ఎక్కడ కూడా నిర్మాణం చేపట్టడం లేదని విమర్శించారు.

ప్రజలకు పౌర సేవలను అందడం లేదని,శానిటేషన్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

గల్లీలో సిసి రోడ్డు నిర్మాణం సరిగా లేక ప్రజలు ప్రమాదాల గురవుతున్నా కూడా టీఆర్ఎస్ మున్సిపల్ పాలకపక్షం పట్టించుకోక,ప్రజల ఇబ్బందులను పక్కనపెట్టి కేవలం టిఆర్ఎస్ పార్టీని వార్డులలో బలోపేతం చేయడం కోసం వార్డులో పర్యటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తక్షణమే ఆబాదిలోని బహార్ పేట ప్రాంతానికి 50 లక్షల రూపాయల నిధులు 25వ వార్డు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ ఈరపాక నరసింహ,పడిగెల ప్రదీప్,సలావుద్దీన్,నాతోటి రాము, మాదాస్ గోవర్ధన్,హైదర్ ఖాన్,కాల్య నాగరాజు, నిసంగి విద్యాసాగర్,యూత్ కాంగ్రెస్ నాయకులు ముత్యాల మనోజ్,కొల్లూరి రాజు,అందే నరేష్, సిరిపంగ చందు,మాటూరి కిషోర్,సాయి సిద్ధార్థ, శ్రీనివాస్,గంగిశెట్టి నాగరాజు,తాళ్ల వీరేశం తదితరులు పాల్గొన్నారు.

నాని బలగం వేణు కాంబో మూవీ క్యాన్సిల్ అయిందా.. ఈ సినిమాకు సమస్య ఇదేనా?