బండి సంజయ్ ఫోన్‌ బయట పడితే రాజకీయ సంచలనం

పదవ తరగతి హిందీ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) అరెస్టు నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది.

పోలీసులకు బండి సంజయ్ వినియోగించే మొబైల్ ఫోన్( Bandi Sanjay Phone ) లభించక పోవడం పట్ల ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఒక వేళ బండి సంజయ్ ఫోన్ కనుక పోలీసులకు లభిస్తే రాజకీయ సంచలనం ఖాయం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

అధికార పార్టీ కి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలతో మరియు ఇతర పార్టీ లకు చెందిన నాయకులతో కూడా ఈ మధ్య లేదా అంతకు ముందు బండి సంజయ్ గతం లో మాట్లాడిన సందర్భాలు ఉంటాయని.

వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రలోభ పెట్టేందుకు కూడా ప్రయత్నించి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / కనుక కచ్చితంగా ఆ ఫోన్ లభిస్తే రాజకీయ సంచలనం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

సోషల్ మీడియాలో బండి సంజయ్ ఫోన్ లో ఉన్న మ్యాటర్ గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ప్రస్తుతం బండి సంజయ్ జైల్లో ఉన్నాడు.

అతి త్వరలోనే ఆయన ను విచారణకు పోలీసులు తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

"""/" / రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ పట్ల బీజేపీ శ్రేణులు( BJP ) తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు.

అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.ఈ సమయంలో బండి సంజయ్ ఫోన్ ను వెతికేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తానికి ఈ కేసు అత్యంత ప్రభావవంతంగా తెలంగాణ రాజకీయాల్లో నిలువబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యం లో బీజేపీ అధినాయకత్వం వాకబు చేసినట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా ఎఫ్ ఐ ఆర్ ను తెప్పించుకుని అధినాయకత్వం పరిశీలించినట్లగా కూడా సమాచారం అందుతోంది.