అల్లరి నరేష్ క్రేజీ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
TeluguStop.com
నిధ ఈ పేరు వినగానే ఎక్కడో తెలిసిన పేరులా ఉందే అనుకుంటాం.అవును నిజం.
ఈ పేరును మనం ఇంతకు ముందే విన్నాం.తెలుగు సినిమా పరిశ్రమల కొన్ని సినిమాలు చేసి మాయమైన హీరోయిన్ పేరు.
ఇలా వచ్చి అలా వెళ్లిన నటీమణి పేరు.ఇంతకీ ఈ నటీమణి తెలుగులో అంత సక్సెస్ ఎందుకు కాలేదో తెలుసుకుందాం.
అల్లరి నరేష్ హీరోగా సత్తిబాబు దర్శకత్వంలో వచ్చిన బెట్టింగ్ బంగార్రాజు సినిమా చక్కటి విజయం సాధించింది.
మంచి కామెడీతో జనాలను కడుపుబ్బా నవ్వించింది.ఈ సినిమాలో అల్లరి నరేష్ పక్కన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి.
తొలి సినిమాతోనే చక్కటి హిట్ అందుకుంది.వెంటనే తనకు మరికొన్ని అవకాశాలు వచ్చాయి.
"""/"/
బెట్టింగ్ బంగార్రాజు మూవీ అనంతరం డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన రణం-2లో ఛాన్స్ దక్కించుకుంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.అయితే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.
తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుని ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది.
కానీ తన ఆశలన్నీ ఈ సినిమా దెబ్బకు కొట్టుకుపోయాయి. """/"/
అమ్మా రాజశేఖర్ సినిమా దెబ్బతో నిధి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి శాశ్వతంగా దూరం అయ్యింది.
ఆ తర్వాత మరే సినిమా చేయలేదు.కొంత కాలం ఎంజాయ్ చేసిన ఈ అమ్మడు తర్వాత ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకుంది.
ఆ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నిధి మ్యారీడ్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేసింది.
ప్రస్తుతం వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.బిజీ బిజీగా గడుపుతోంది.
హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా బిజినెస్ పర్సన్ గా మాత్రం విజయవంతంగా ముందుకు సాగుతోంది అల్లరి నరేష్ హీరోయిన్.
ఒకప్పుడు సైడ్ ఆర్టిస్ట్… ఇప్పుడు మాత్రం క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా?