పవన్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకులు.. ఇప్పుడు ఆ ఇద్దరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

మామూలుగా డైరెక్టర్లు ఏ సినిమాతోనైనా హిట్ కొడితే వెంటనే మరో సినిమా కోసం బిజీగా మారుతూ ఉంటారు.

ఇక వాళ్ళు ఇతర హీరోలను ఎంచుకోక ముందుకే వాళ్ల దగ్గరికి హీరోలు వచ్చి సినిమాల గురించి అడుగుతూ ఉంటారు.

ఎందుకంటే ఒక హిట్టు కొట్టడంతో డైరెక్టర్ల వెంట పడుతూ ఉంటారు స్టార్ హీరోలు.

అయితే ఇద్దరు దర్శకులు మాత్రం స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు మంచి సక్సెస్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఇద్దరు దర్శకులు కనిపించకుండా పోయారు.

అంటే ఏ సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నారు అని అర్థం.ఇంతకు ఆ దర్శకులు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తో వరుస సినిమాలతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్నాడు.

ఒక వైపు రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ కూడా అక్కడ బ్రేక్ తీసుకొని ఏ దర్శకులను నిరాశపరచకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఇక్కడ బ్రేక్ దొరకటంతో వెంటనే రాజకీయాలలో బిజీగా మారుతున్నాడు.మొత్తానికి రెండు వైపులా చాలా బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ గతంలో మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

"""/"/అయితే ఈ సినిమా రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా ఎంతలా హిట్ టాక్ సొంతం చేసుకుందో చూశాం.

దాంతో పవన్ కళ్యాణ్ కు వెంటనే భీమ్లా నాయక్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు.

ఇక వరుసగా రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ కోసం చాలామంది డైరెక్టర్లు మంచి మంచి కథలతో క్యూ కట్టారు.

అయితే ఇప్పుడు వాళ్లతోనే బిజీగా ఉన్నాడు పవన్.కానీ ఈయనకు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో సక్సెస్ అందించిన డైరెక్టర్లు వేణు శ్రీరామ్, సాగర్ కె చంద్ర మాత్రం మౌనంగా ఉన్నారు.

అదేంటి అంత సక్సెస్ అందించినప్పటికీ వీరు కూడా చాలా బిజీగా ఉండాలి కదా అని అనుకుంటూ ఉండొచ్చు.

"""/"/ కానీ వీరు మాత్రం ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

మామూలుగా వకీల్ సాబ్ తర్వాత శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఆగిపోయిన సినిమా మొదలు పెడతారని అందరూ అనుకున్నారు.

కాని దాని గురించి ఎటువంటి అప్డేట్ లేదు.భీమ్లా నాయక్ తర్వాత సాగర్ చంద్ర కూడా టాలీవుడ్ లో ఏ హీరో తో కూడా కమిట్మెంట్ తీసుకోలేదు.

దీంతో వీరిద్దరు ఇలా ఉండటంతో చాలామంది అనుమానం పడుతున్నారు.అంటే వీరి కోసం ఏ హీరో ముందుకు రావట్లేదా అని.

లేదా వీళ్లే కావాలని సినిమాలకు బ్రేక్ తీసుకున్నారా అని అనుమానం పడుతున్నారు.ఇక వీరి సినిమాల గురించి అప్డేట్ వచ్చేవరకు వీరి దగ్గర ఇప్పుడు ఎటువంటి సినిమా లేదని అర్థమవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, బుధవారం 2024