మ‌న దేశంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా జ‌రిగిందో తెలుసా?

భారతదేశంలో రైలు ప్రమాదాల్లో ఏటా వందల మంది మరణిస్తున్నారు.ఈ ప్రమాదాలకు సాంకేతిక లోపం, మానవ తప్పిదం, నిర్లక్ష్యం, అన‌నుకూల‌ వాతావరణం మొదలైనవి కార‌ణాలుగా నిలుస్తున్నాయి.

జూన్ 6, 1981 న జరిగిన రైలు ప్రమాదం అత్యంత ఘోర‌మైన‌ది.

అది భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత భయంకరమైన ప్రమాదం.ఈ ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది.

6 జూన్ 1981.అది సాయంత్రం సమయం.

9 కోచ్‌ల ప్యాసింజర్ రైలు ప్రయాణికులతో నిండిపోయింది.రైలు నంబర్ 416డీఎన్ మాన్సీ నుండి సహర్సా(బీహార్‌) వైపు వెళుతోంది.

రైలు బద్లా ఘాట్ మరియు ఢమరా ఘాట్ స్టేషన్ మధ్య బాగ్మతి నది గుండా వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ప్రయాణికుల కేకలు వేశారు.ఆ సమయంలో వారిని రక్షించే వారే లేరు.

సమీపంలోని ప్రజలు నది వద్దకు చేరుకునే సరికి వందలాది మంది నదిలో మునిగి చనిపోయారు.

ఈ ప్రమాదం భారతదేశంలో అతిపెద్ద రైలు ప్రమాదం.ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైలు ప్రమాదం.

ఈ ఘోర రైలు ప్రమాదం తర్వాత, సెర్చ్ ఆపరేషన్ చాలా రోజుల పాటు కొనసాగింది.

ఐదు రోజుల పాటు శ్రమించి 200కు పైగా మృతదేహాలను నది నుండి బయటకు తీశారు.

"""/"/ నది ప్రవాహానికి పలువురి మృతదేహాలు కొట్టుకుపోయాయి.ఈ ప్రమాదంలో సుమారు 300 మంది ప్రయాణికులు మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

తుఫాను కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కొందరు, నదికి ఒక్కసారిగా వరదలు రావడంతో రైలు ప‌డిపోయింద‌ని కొందరు అంటున్నారు.

వంతెనపై ఉన్న ఆవును రక్షించడానికి లోకో పైలట్ అకస్మాత్తుగా పదునైన బ్రేక్‌లు వేశాడ‌ని.

దీని కారణంగా రైలులోని చివరి 7 కోచ్‌లు బోల్తా పడి, వంతెనను చీల్చుకుని నదిలో పడిపోయాయ‌ని కూడా కొందరు చెబుతున్నారు.

అఖిల్ సినిమా కెరియర్ ఎటు పోతుంది..? ఇప్పటికైనా సక్సెస్ దక్కుతుందా లేదా..?