తులం బంగారం ఎప్పుడిస్తారు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

సోమవారం పెన్ పహాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ 63 చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం వస్తుందని కొత్తగా పెళ్లైన వారు ఆశపడ్డారని,వారి ఆశలు అడియాశలయ్యాయన్నారు.

తీరా చూస్తే గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన చెక్కులే ఇచ్చారన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మహీందర్ రెడ్డి, ఎంపిడిఓ,మార్కేట్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, జనికిరాంరెడ్డి,మహిళలు పాల్గొన్నారు.

రాజమౌళి ఓ పిచ్చోడు.. ప్రేమతో తారక్ చేసిన ఈ కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!