పెండింగ్ సీట్లు ఎప్పుడు ప్రకటిస్తారో ? 

బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల ప్రకటన ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పటికే ఎంతోమంది అధినేత నిర్ణయంపై అసంతృప్తి కి గురై పార్టీకి రాజీనామా చేయగా , మరి కొంతమంది అదే బాటలో ఉన్నారు.

దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ టికెట్లను ఖరారు చేయడంతో , టికెట్ పొందినవారు, ఆశావాహులు తీవ్ర అసంతృప్తి గురయ్యారు.

ఇక మంత్రి కేటీఆర్( Ktr ) అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలి అని, అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలనే విధంగా అసంతృప్త నాయకులు ఉన్నారు.

అయితే కేసీఆర్ ప్రకటించిన లిస్టులో కొన్ని నియోజకవర్గాలను మినహాయించారు.వాటిలో హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించి రెండు , అలాగే జనగామ, నరసాపూర్ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు.

దీంతో పాతబస్తీ కి సంబంధించిన రెండు నియోజకవర్గాల పైన అంతగా ఇబ్బంది లేకపోయినా , జనగామ నరసాపూర్ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి పడింది.

"""/" /  ఇక్కడ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారు అనే చర్చ పార్టీలో జరుగుతుంది.

పెండింగ్ లో పెట్టిన నియోజకవర్గాలలో అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు ? ఎవరిని ఎంపిక చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

నర్సాపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కెసిఆర్ టికెట్ నిరాకరించడంతో , అక్కడ ఎవరి పేరును ప్రకటిస్తారనేది తేలాల్సి ఉంది.

మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి ఈ టికెట్ ఖరారు చేస్తారని ఆశించినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు.

అయితే తనకే ఈ టిక్కెట్ ఇవ్వాలని మదన్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఆయన అనుచరులు ఇదే విషయంపై హడావుడి చేస్తున్నారు.ఇక సునీత లక్ష్మారెడ్డి సీఎం కేసీఆర్( CM Kcr ) ను ఇదే విషయంపై కలవగా, మరి కొంతకాలం ఆగాలని చెప్పినట్లు సమాచారం.

మదన్ రెడ్డితో మాట్లాడి ఆ తర్వాతే టికెట్ ఖరారు చేస్తానని కేసీఆర్ తెలిపారట.

ఇక జనగామ టికెట్ విషయంకొస్తే మంత్రి కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో దీనిని వాయిదా వేసినట్లు సమాచారం.

ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఖరారు అయిందని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు """/" /  పల్లా కూడా జనగామ నియోజకవర్గం పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు.

అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డి( Muthireddy Yadagiri Reddy ) కి టికెట్ నిరాకరించడంతో జనగామ టికెట్ కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డి తో పాటు,  వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీపడుతున్నారు.

కేటీఆర్ కు ఈయన క్లాస్మేట్ కావడంతో తనకు టికెట్ తప్పకుండా దక్కుతుందని,  కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాక జనగామ టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక గోషామహల్ విషయంలో ఎంఐఎం సలహా మేరకు అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తారట.కెసిఆర్ ,కేటీఆర్ తీసుకునే నిర్ణయం పైనే అందరిలోనూ  ఉత్కంఠ నెలకొంది.

చైనా: అందంగా కనిపించాలని ఒకే రోజులో 6 సర్జరీలు చేయించుకుంది.. చివరికేమైందో ఊహించలేరు..!