ఏపీలో టిడిపి , జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా నెలలే అవుతున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచనతో టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు.
దీనిలో భాగంగానే ఇప్పటికే మూడు పార్టీలు కలిసి నామినేటెడ్ పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలి ? ఎవరికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలి ? ఏ పార్టీకి ఎన్ని నామినేటెడ్ పదవులను కేటాయించాలనే విషయంలో ఒక క్లారిటీ కి వచ్చారు.
దీనికి సంబంధించి తూది కసరత్తు జరుగుతోంది.మూడు పార్టీలకు రాష్ట్రస్థాయి పదవులను ఖరారు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే ఈ పదవుల భర్తీ ప్రకటన చేయాల్సి ఉన్నా.మరోసారి వడబోత కోసం వాయిదా వేస్తారు.
దసరాకు ముందే ఈ పదవులను భర్తీ చేసే విధంగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు .
ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనే విషయం పైన ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారు.
"""/" /
టిడిపికి 60 శాతం , జనసేనకు 30 శాతం మిగిలిన 10% పదవులు బిజెపికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు .
ఈ నేపద్యంలో రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాల ట్రస్ట్ బోర్డ్ పాలక వర్గాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన న్యాయం చేసే విధంగా విధివిధానాలు రూపొందించారు.
టిడిపి ,జనసేన , బిజెపి కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు .
మూడు పార్టీలకు పదవుల పంపిణీ విషయంలో ఒక ఫార్ములాను ఆమోదించారు. టిడిపిలో సీట్లు దక్కని నేతలకు రాష్ట్రస్థాయి పదవులను ఇవ్వనున్నట్లు సమాచారం.
దీనిలో భాగంగానే మాజీమంత్రి టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు( Devineni Uma Maheswara Rao )కు ఆర్టీసీ చైర్మన్ , ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్ , పట్టాభికి పౌరసరఫరాల కార్పొరేషన్ , మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్ , మరో మాజీ మంత్రి కిలారి శ్రావణ్ కు ఎస్టి కమిషన్ చైర్మన్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
"""/" /
జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటు ఇవ్వడంతో అక్కడ అవకాశం కోల్పోయిన టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసా( Alapati Rajendra Prasad )ద్ కు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉన్నారట రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు, మెంబర్లు కలిసి భారీగా పోస్టులు ఉన్నాయి.
ఇవన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట.
అతిగా యాడ్స్ వేయడంతో పీవీఆర్ – ఐనాక్స్కి షాక్ ఇచ్చిన వినియోగదారుడు!