Motorola G04 : మోటోరోలా జీ04 స్మార్ట్ ఫోన్ రూ.10 వేల బడ్జెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందంటే..?
TeluguStop.com
మోటోరోలా జీ04 స్మార్ట్ ఫోన్( Motorola G04 ) రూ.10 వేల బడ్జెట్ లో భారత మార్కెట్లో వచ్చేవారం లాంచ్ అవ్వనుంది.
ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.ఈ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం.
మోటోరోలా జీ04 స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.6 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్, యూనిసొక్ టీ 606 ప్రాసెసర్ పై పని చేస్తుంది.
5000 MAh బ్యాటరీ సామర్థ్యం కలిగి,10w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
"""/" /
ఈ ఫోన్ ఆరెంజ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ 4GB RAM+ 64GB స్టోరేజ్,( 4GB RAM+ 64GB Storage ) 8 GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ లలో ఉంటుంది.
ఒకవేళ కావాలనుకుంటే వర్చువల్ RAM ఫీచర్ ద్వారా RAM ను 16GB వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ 16 మెగా పిక్సెల్ కెమెరా తో ఉంటుంది.ఒకసారి చార్జింగ్ పెడితే 102 గంటల పాటు మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం, 22 గంటల టాక్ టైం అందిస్తుంది.
డాల్బీ అట్మాస్ ఫీచర్ సపోర్టుతో స్పీకర్లు పనిచేస్తాయి.ఈ ఫోన్ 0.
79 సెంటీమీటర్ల మందం, 179 గ్రాముల బరువు తో ఉంటుంది. """/" /
ఈ మోటోరోలా జీ04 స్మార్ట్ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది.
యూరప్ లో ఈ ఫోన్ ధర 119 యూరోలు.భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.
10 వేల లోపు ఉండే అవకాశం ఉంది.ఫిబ్రవరి 15వ తేదీ భారత మార్కెట్లో లాంచ్ అవ్వనుంది.
రెప్పపాటులో 20లక్షలు హుష్ కాకి.. వీడియో వైరల్