ఆ ఓటీటీ లోనే మళ్లీ పెళ్లి స్ట్రీమింగ్ …. ఎప్పుడంటే?
TeluguStop.com
నరేష్(Naresh) పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) జంటగా నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి(Malli Pelli).
నరేష్ సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి విజయకృష్ణ మూవీస్ బ్యానర్ లోఈ సినిమా తెరకెక్కింది.
ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ ఫలితాలను అందుకుంది.
నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.
"""/" /
ఈ సినిమా ద్వారా నరేష్ పవిత్ర లోకేష్ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఈ సినిమా విడుదలయ్యి మొదటి రోజు దాదాపు రూ.30 లక్షల వరకు వసూళ్లు రాబట్టిందని సమాచారం.
కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.
ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Videos) సొంతం చేసుకుంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ బారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.
"""/" /
ఇక ఈ సినిమా థియేటర్లలో వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఈ సినిమా ఓటీటీ తేదీని కరారు చేయబోతున్నారు.
ఇక ఈ సినిమా తెలుగు కన్నడ భాషలలో విడుదల అయ్యింది.పవిత్ర లోకేష్ కన్నడ నటి కావడంతో అక్కడ కూడా ఈక్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు ఈ సినిమాను కన్నడలో కూడా విడుదల చేశారు.
ఇక ఈ సినిమాలో నటి వనిత విజయ్ కుమార్ కూడా నటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారనీ తెలుస్తుంది.
డైరెక్టర్ అనుదీప్ కెవి చెప్పిన కథను వెంకటేష్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?