సుకుమార్ పుష్ప 3 మీద అప్డేట్ ఇచ్చే రోజు అదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్.

( Director Sukumar ) ఇక ఈయన ఏ సినిమా చేసిన కూడా అందులో లాజిక్స్ లకి ప్రాధాన్యతను ఇస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు.

మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన అన్ని సినిమాలను కూడా సక్సెస్ లతో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు అయితే సాగాయి.

"""/" / ఇక ఈ క్రమంలో పుష్ప సినిమాతో( Pushpa ) పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించి దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే రాబట్టాడు.

ఇక దాంతో ఇప్పుడు పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా మీద పాన్ ఇండియాలో భారీ అంచనాలైతే నెలకొన్నాయి.

ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ఈ సినిమా మీద అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాతో సుకుమార్ మరోసారి పాన్ ఇండియాలో తన సత్తాను అయితే చాటే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు పుష్ప 3( Pushpa 3 ) సినిమా కూడా రాబోతుందనే వార్తలైతే బయటికి వచ్చాయి.

ఇక ఈ సినిమాని కూడా తెరకెక్కించడానికి సుకుమార్, అల్లు అర్జున్ ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఎందుకంటే పుష్ప స్టోరీని చెప్పడానికి రెండు పార్టులు సరిపోవట్లేదని అందుకే మూడో పార్ట్ ను కూడా తెరకెక్కించాలనే ఉద్దేశ్యం లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ని ఈనెల చివరి వారం లో చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక దాంతో పాటుగా పుష్ప 3 కి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

చూడాలి మరి పుష్ప2 ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అలాగే పుష్ప 3 పోస్టర్ కూడా ఎలాంటి కిక్కునిస్తుంది అనేది.

స్టార్ హీరో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్.. అసలేం జరిగిందంటే?