ఈ నాలుగు సినిమాల్లో ఫైట్స్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే.. నో డౌట్!

కరోనా రెండవ దశ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలు పలు చిత్రాలలో నటించారు.

ప్రస్తుతం ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే ఈ నెల ఆఖరి వచ్చే ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో RRR సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కానుంది.ఇక ఇందులో ఉన్నటువంటి ఎన్నో ఫైట్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పోస్టర్లలో తెలిసిపోయింది.

ముఖ్యంగా ఈ సినిమాలో వర్షంలో చేసేటటువంటి ఫైట్ సన్నివేశం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

ఇక లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ,రష్మిక జంటగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.

ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడవిలో జరిగే ఫైట్ సన్నివేశం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని తెలుస్తోంది.

ఐదు భాషలలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఇక ఇందులో సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

"""/" / యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం సలార్.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటోంది.ఇందులో ప్రభాస్ అభిమానులను మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒక ఫ్యాక్టరీ ఫైట్ సన్నివేశం ఉండబోతుందని ఈ ఫైట్ సీన్ సినిమాకు ఎంతో హైలెట్ అవబోతుందని చిత్ర బృందం భావించారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. """/" / ఇక పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నటువంటి చిత్రం సర్కారు వారి పాట.

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని వచ్చే ఏడాది వేసవి సెలవులలో విడుదల కానుంది.

ఇక ఈ సినిమా బ్యాంకు దోపిడీ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఈ చిత్రంలో ఎడారిలో ఒక యాక్షన్ సన్నివేశాన్ని తీశారని ఈ సన్నివేశం సినిమాకి హైలెట్ అవుతుందని చిత్ర బృందం వెల్లడించారు.

"""/" / ఇక ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటిస్తున్నటువంటి ఈ నాలుగు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని ఇందులో ఉన్నటువంటి ఈ ఫైట్ సీన్స్ చూస్తే మాత్రం వారి అభిమానులకు థియేటర్లో తప్పకుండా పూనకాలు వస్తాయని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఈ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య అఖండ 2 సినిమాలో విలయ తాండవం చేయబోతున్నాడా..?