పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన ఎప్పుడంటే..? 

వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party ) కాంగ్రెస్ లో విలీనం అయ్యే సమయం దగ్గరకు వచ్చింది.

అధికారంలోకి రావాలనే పట్టుదలతో షర్మిల సుదీర్ఘంగా తెలంగాణలో పాదయాత్రను నిర్వహించారు.నిత్యం బిఆర్ఎస్ ప్రభుత్వం పైన,  సీఎం కేసీఆర్ పైన అనేక విమర్శలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న అన్ని సమస్యల పైన షర్మిల స్పందిస్తూ,  తమ పార్టీ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు చేశారు.

అయితే సక్సెస్ కాలేదు .పార్టీలో మొదట్లో చేరిన నేతలు తప్ప,  కీలక నేతలు ఎవరు చేరకపోవడం,  మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడిన  నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు కోసం ఆమె ప్రయత్నించారు.

"""/" /</  కానీ విలీనం చేయాల్సిందిగా కాంగ్రెస్ హై కమాండ్ పెద్దలు షరతులు విధించడంతో రెండు రోజుల క్రితమే ఆమె ఢిల్లీకి వెళ్లి రాహుల్ , సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు .

ఆ భేటీకి సంబంధించిన వివరాలు ఏవి బయటకు రాకుండా షర్మిల( Ys Sharmila ) జాగ్రత్తపడ్డారు.

  హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన చేస్తానని ఆమె తెలిపారు.

ఇదిలా ఉంటే షర్మిల నిన్న సాయంత్రం ఏపీలోని పులివెందులకు చేరుకున్నారు.ఈరోజు తన తండ్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి( YS Rajasekhara Reddy )సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్  సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.

ఈ మేరకు హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న ఆమె అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయ కు చేరుకున్నారు.

వై ఎస్సార్ ఘాట్ వద్ద ఈరోజు ఉదయం నివాళులర్పించారు.అనంతరం కాంగ్రెస్ వైయస్సార్ తెలంగాణ పార్టీ విలీనం తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

"""/" /   కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం అయినా, తెలంగాణలో కంటే ఏపీకే ఆమెను పరిమితం చేయాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారట.

షర్మిల రాకను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంతగా స్వాగతించకపోవడం,  ఏపీలో కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో,  షర్మిల ద్వారా ఆ లోటును తీర్చుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట.

షర్మిల ప్రకటన తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరికీ క్లారిటీ రానుంది.

కూతురి పెళ్లిరోజు ఈ తండ్రి ఎంత సాహసం చేశాడో తెలిస్తే..