అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది? ముహూర్తం ఎప్పుడో తెలుసా?

హిందువులు పండుగలా భావించే వాటిలో అక్షయ తృతీయ ఒకటి.అక్షయ తృతీయ రోజు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మికి, కుబేరుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

సంపదలను కలిగించేది మహాలక్ష్మి అయితే ఆ సంపదలకు అధిపతిగా కుబేరుడిని పూజిస్తారు.అక్షయ తృతీయ రోజు మనం చేసే ఎటువంటి శుభకార్యాలు అయినా ఎంతో మంచి ఫలితాలనిస్తాయి.

అక్షయ తృతీయ రోజు త్రేతా యుగం ప్రారంభమైందని, పరుశురాముడు జన్మించాడని, ఇటువంటివి అక్షయ తృతీయ రోజు జరగడం వల్ల అక్షయ తృతీయను పెద్ద పండుగగా నిర్వహించుకుంటారు.

ఈ ఏడాది  అక్షయ తృతీయ 2021 మే 14 న వచ్చింది.తిథి శుభ సమయం.

ఇది మే 14, ఉదయం 05.38 నుండి ప్రారంభమవుతుంది.

2021 మే 15న ఉదయం 07.59 వరకు కొనసాగుతుంది.

పవిత్ర ఆరాధన సమయం ఉదయం 05.38 నుండి మధ్యాహ్నం 3.

12 వరకు ఉంటుంది.ఈ మొత్తం శుభ ముహూర్త సమయం 06 గంటలు 40 నిమిషాలు.

సంవత్సరంలో మూడున్నర అక్షయ ముహూర్తాలు ఉన్నాయని చెబుతారు.ఇందులో మొదటి ప్రత్యేక అక్షయ తృతీయ ముహూర్తం.

ఈ ముహూర్తంలో ఏం చేసినా కూడా అక్షయమవుతుందని భావిస్తారు. """/" / ఈ అక్షయ ముహుర్తం రోజున ఎంతో మంది ఎన్నో శుభకార్యాలు నిర్వహిస్తారు.

కొందరు వివాహం జరుపుకోగా మరికొందరు గృహప్రవేశం చేస్తారు.ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఎంతో శుభప్రదమని భావిస్తారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి ఇష్టపడుతుంటారు.అదేవిధంగా మన స్థాయికి తగ్గట్టుగా దానధర్మాలను కూడా చేయాలి.

ఈ క్రమంలోనే ఉప్పు, బియ్యం, నెయ్యి,చింతపండు వంటి వస్తువులను దానం చేయడం ఎంతో మంచిది.

అదేవిధంగా అక్షయ తృతీయ రోజు పితృదేవతలకు తర్పణాలు కూడా వదులుతారు.ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు శ్రీ విష్ణు సహస్ర పఠనం, శ్రీ సూక్త పారాయణం లేదా శ్రీరామ చరిత్ర పఠనం చేయడం ద్వారా కీర్తి గౌరవం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ రాత్రిపూట అలాంటి సినిమాలు చూస్తారా… ఇలాంటి అలవాటు కూడా ఉందా?