Tinoo Anand : ఈ ప్రముఖ డైరెక్టర్ లో దుస్తులతో నటించాలని స్టార్ హీరోయిన్ ను వేధించాడట.. చివరకు?

మామూలుగా సినిమాలలో నటిస్తున్నప్పుడు డైరెక్టర్లు( Directors ) కొన్ని కొన్ని సన్నివేశాలలో నటించమని చెప్పినప్పుడు హీరోయిన్లు నో చెప్పడం కొన్ని కొన్ని సార్లు రిజెక్ట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

అలా మాట మాట పెరిగి కొన్నిసార్లు ఆ హీరోయిన్లు ఏకంగా సినిమానే రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

అలా ఒక డైరెక్టర్ కూడా ఒక సన్నివేశం విషయంలో హీరోయిన్ తో గొడవ పడడంతో ఏకంగా సినిమానే ఆపివేశారు.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అసలు ఏం జరిగింది? ఆ సినిమా పేరు ఏంటి?అన్న వివరాల్లోకి వెళితే.

బాలీవుడ్ నటుడు దర్శకుడు టీనూ ఆనంద్( Tinoo Anand ) సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ విషయంలో నటితో గొడవ పడడంతో ఏకంగా సినిమాని నిలిపివేశారు.

"""/" / బాలీవుడ్ స్టార్స్ ( Bollywood Stars )తో గ్రాండ్ గా మొదలైన ఆ సినిమా ఊహించని విధంగా ఐదు రోజులపాటు షూటింగ్ జరుపుకొని ఊహించిన విధంగా అట్టకెక్కింది.

దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు టీనూ ఆనంద్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ నటి మాధురి దీక్షిత్ ( Actress Madhuri Dixit )కాంబినేషన్లో 1989లో Shanakht అనే సినిమాను రూపొందించాలి అనుకున్నాము.

వారిద్దరి కాంబినేషన్లో అదే మొదటి సినిమా.దాంతో ఆ సినిమా విడుదల కాకముందే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ సినిమాలోని ఒక సీక్వెన్స్ లో అమితాబ్ బచ్చన్ ను కొంతమంది రౌడీలు బంధిస్తారు.

"""/" / హీరోయిన్ ను రౌడీల నుంచి కాపాడడం కోసం చాలా శ్రమిస్తారు.

ఈ సమయంలోనే తనను రచించిన హీరోకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనతో అన్ని విధాలుగా దగ్గర అవ్వాలనుకుంటుంది హీరోయిన్( Heroine ).

ఈ నేపథ్యంలోనే సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాల్లో హీరోయిన్ ని లోదుస్తులతో చూపించాలి అనుకున్నాను.

ఆ విషయాన్ని మాధురి దీక్షిత్ కు చెప్పాను.మొదట్లో ఆమె ఓకే చెప్పారు.

కానీ తీరా షూట్ రోజు లోదుస్తులతో నటించడానికి ఆమె అంగీకరించలేదు.ఆ విషయంలో నాకు మాధురి దీక్షిత్ కి మధ్య గొడవ జరగడంతో ఆ సీన్ చేయకపోతే సెట్ లో నుంచి వెళ్లిపోమని చెప్పాను.

ఆ మాటకు ఆమె బ్యాట్ తీసుకొని వెళ్ళిపోయింది అని తాజాగా తెలిపారు టీనూ ఆనంద్.

అలా ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది అని ఆయన వెల్లడించారు.కాగా టీనూ ఆనంద్ కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కొన్ని సినిమాలలో నటించి మెప్పించారు.

మొదట ఆదిత్య 369 సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.అంజి సినిమాలో విలన్ గా నటించారు.

త్వరలోనే రాబోతున్న సలార్ సినిమాలో కూడా నటించారు ఆనంద్.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?