సైబర్ నేరగాళ్లకు కాలం చెల్లినట్టే.. రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ..!

కరోనా అనంతరం దేశవ్యాప్తంగా ఆన్లైన్ లావాదేవీలు విస్తృతంగా పెరిగాయి.అయితే సైబర్ మోసాలు( Cyber ​​fraud ) కూడా అంతే వేగంగా పెరుగుతూ వెలుగులోకి వస్తున్నాయి.

ఈమధ్య సైబర్ క్రైమ్ వార్తలే అధికంగా వింటున్నాం.ఆన్ లైన్ గురించి సరైన అవగాహన లేని అమాయకులను టార్గెట్ చేస్తూ సైబల్ నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.

ఈ సైబర్ మోసాలను అరికట్టేందుకు కంపెనీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.కస్టమర్లకు సేఫ్ అండ్ సెక్యూరిటీ( Safe And Security ) సేవలు అందించాలని చూస్తున్నాయి.

పేటీఎం తన ప్లాట్ ఫామ్ పై జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ విషయాన్ని స్వయంగా పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ వర్మ తెలిపారు. """/" / ఈ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ మోసాలను గుర్తించడం, కస్టమర్ కేర్, కస్టమర్ ఆన్ బోర్డింగ్( Customer Care, Customer On Boarding ) లాంటి విభాగాలలో ఉపయోగించనున్నారు.

అంతేకాకుండా ఈ టెక్నాలజీని మనుషులు చేసే పనులను పూర్తి చేసే విధంగా డెవలప్ చేశారు.

జనరేటివ్ ఏఐ టెక్నాలజీ తో సైబర్ మోసాలకు చెక్ పెట్టడమే కాక సేవలు సమర్థవంతంగా మారతాయని విజయ్ శర్మ( Vijay Sharma ) తెలిపారు.

దీనితో కస్టమర్ ఇచ్చిన ఫ్రాంట్ తో ఆటోమేటిక్ గా కొత్త కంటెంట్, కోడ్ లేదా సింథటిక్ డేటాను ఉత్పత్తి చేస్తుంది.

"""/" / పేటీఎం సంస్థ యొక్క నాలుగో త్రైమాసిక గణాంకాల ప్రకారం ఆదాయం 52% పెరిగి, రూ.

2,335 కోట్లకు కు చేరింది.దీంతో నష్టాలు భారీగా తగ్గి రూ.

168 కోట్లకు పరిమితం కావడం గమనార్హం.గత కొన్ని రోజులుగా పేటీఎం సంస్థ ఆదాయం పెంచుకోవడం తో పాటు నష్టాలు తగ్గించుకునే పనిలో పడింది.

ఇక పేటీఎం ద్వారా సైబర్ నేరాలకు పడేందుకు వీలు లేకుండా ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మెరుగైన సేవలు అందిస్తుందని పేటియం సీఈవో విజయ్ శర్మ తెలిపారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీ కథ ఇదేనా.. భారీ సినిమానే ప్లాన్ చేశారుగా!