ఫ్యామిలీ మ్యాన్‌ 2 తెలుగులో ఎప్పుడో తెలుసా?

నార్త్‌ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్‌ అంతా కూడా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 స్ట్రీమింగ్‌ ప్రారంభం అయ్యింది.

సమంత నటించడం తో పాటు ఈ వెబ్‌ సిరీస్ కు సౌత్‌ ఆడియన్స్ కు కనెక్షన్ ఉన్న కారణంగా తెలుగు మరియు తమిళంలో కూడా స్ట్రీమింగ్‌ చేసేందుకు చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు.

కాని ఈ వెబ్‌ సిరీస్ ను కేవలం హిందీ లో మాత్రమే స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.

టెక్నీకిల్‌ ప్రాబ్లం కారణంగా వెబ్‌ సిరీస్ ను సౌత్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ చేడయం లేదు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

కాని తమిళంలో ఉన్న విభేదాల కారణంగానే ఈ వెబ్‌ సిరీస్ ను ఇతర భాషల్లో విడుదల చేయలేదు అనే విషయం అందరికి తెలిసిన రహస్యం.

వెబ్‌ సిరీస్‌ సౌత్‌ భాషల స్ట్రీమింగ్‌ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగినా కూడా వివాదం ముదిరే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కాస్త ఆలస్యం గా అయినా కూడా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ సౌత్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ అవ్వడం ఖాయం అంటున్నారు.

కనుక తెలుగు ఆడియో ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు తెలుగు ఆడియో స్ట్రీమింగ్‌ కు సంబంధించిన విషయాన్ని గురించి అమెజాన్‌ స్పష్టతను ఇచ్చింది.

ఈ వారంలో వెబ్ సిరీస్‌ తెలుగు మరియు తమిళ ఆడియో ఏ క్షణంలో అయినా అందుబాటు లోకి రావచ్చు అంటున్నారు.

సమంత మరియు మనోజ్‌ బాజ్‌ పెయి కీలక పాత్రలో నటించిన ఈ వెబ్‌ సిరీస్ పై అంచనాలు మొదటి నుండి సౌత్‌ అభిమానుల్లో కూడా భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా వెబ్‌ సిరీస్ ను దర్శక ద్వయం రాజ్ అండ్‌ డీ కే లు తెరకెక్కించారు.

గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై డైరెక్టర్ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్లు.. అలాంటి కామెంట్స్ చేస్తూ?