ఉద్యోగి ప్రాణ రక్షణకు విమానం నడిపేందుకు సిద్ధమైన రతన్ టాటా.. ఆ రోజు ఏం జరిగిందంటే...

దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలలో ఒకటిగా నిలిచిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా నిరాడంబరతకు ప్రసిద్ధి చెందారు.

1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు.గతంలో ఒక ఉద్యోగి ప్రాణాలను కాపాడేందుకు రతన్ టాటా స్వయంగా విమానాన్ని నడిపేంందుకు సిద్ధం అయ్యారు.

ఆ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఈ సంఘటన ఆగస్టు 2004లో చోటుచేసుకుంది.

పూణేలోని టాటా మోటార్స్ ఎండీ ప్రకాష్ ఎం తెలంగ్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను ముంబైకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

ఆరోజు ఆదివారం కావడంతో వైద్యులు ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయలేకపోయారు.ఈ విషయాన్ని అధికారులంతా రతన్ టాటాకు చెప్పగా.

కంపెనీ విమానం నడిపేందుకు ఆయన అంగీకరించారు.రతన్ టాటాకు పైలట్ లైసెన్స్ ఉంది.

అయితే ఇంతలోనే ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి, ప్రకాష్‌ని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ అతనికి విజయవంతంగా చికిత్స జరిగింది.సుమారు 50 ఏళ్ల పాటు టాటా మోటార్స్‌లో పనిచేసిన ప్రకాష్ 2012లో పదవీ విరమణ పొందారు.

యుద్ధ విమానంలో ఎగురుతూ.దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచిన రతన్ టాటా శిక్షణ పొందిన పైలట్.

ఆయన ఫ్లయింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారు.రతన్ టాటా దగ్గర డస్సాల్ట్ ఫాల్కన్ 2000 ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

దీని విలువ దాదాపు రూ.150 కోట్లు.

కొన్ని సంవత్సరాల క్రితం రతన్ టాటా. """/"/యుద్ధ విమానం కాక్‌పిట్‌లో కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయ్యింది.2011లో బెంగళూరు ఎయిర్‌షోలో రతన్ టాటా బోయింగ్ ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానంలో ప్రయాణించించారు.

ఫిబ్రవరి 28, 2019న తన 82వ పుట్టినరోజు సందర్భంగా ఆయన దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రతన్ టాటా 2007లో అమెరికన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ F-16లో ప్రయాణం చేశారు.రతన్ టాటా తన 69 సంవత్సరాల వయసులో అమెరికన్ విమానాన్ని నడిపిన సీనియర్ భారతీయ పౌరునిగా గుర్తింపు పొందారు.

రతన్ టాటాకు విమానాలు నడపటం హాబీ.జేఆర్డీ టాటా దేశానికి చెందిన మొదటి లైసెన్స్ పైలట్.

జేఆర్డీ టాటా మొదటిసారిగా కరాచీ నుండి బొంబాయికి విమానంలో ప్రయాణించారు.టాటా ఎయిర్‌లైన్స్‌ని ఆయనే ప్రారంభించారు.

తర్వాత దానిని ఎయిర్ ఇండియాగా మార్చారు తరువాత దానిని జాతీయం చేశారు.ఇటీవల ఎయిర్ ఇండియా టాటా గ్రూపునకు తిరిగి వచ్చింది.

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!