రాధేశ్యామ్ సమయంలోనే కృష్ణంరాజుకి అనారోగ్య సమస్యలు!
TeluguStop.com
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి ఆయన అభిమానుల తో పాటు సినిమా పరిశ్రమకు చెందిన అందరికీ కూడా తీరని లోటు.
ఐదు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగిన కృష్ణం రాజు ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించారు.
దాదాపు 200 సినిమాల్లో నటించిన కృష్ణంరాజు చివరిగా తన వారసుడు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా లో హీరో పాత్ర కి గురువు గా కనిపించాడు.
ఆ సినిమా లో ప్రభాస్ మరియు కృష్ణంరాజు గురు శిష్యులు గా కనిపించిన నేపథ్యం లో అభిమానులు చాలా ఎక్సైట్ అయిన విషయం తెలిసింది.
మళ్లీ వీరిద్దరిలో సినిమా ఎప్పుడు చూస్తామా అంటూ ప్రభాస్ అభిమానులు.రెబల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా కృష్ణంరాజు మృతి వార్త ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తుంది.
ఇదే సమయంలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్ సమయంలోనే కృష్ణంరాజు యొక్క ఆరోగ్యం సరిగా లేదని ప్రచారం జరుగుతోంది.
ఆ సమయంలో అసలు కృష్ణం రాజు తన పాత్రని పూర్తి చేస్తాడా అని చాలా మంది అనుకున్నారట.
ఏదోలా ఆ సినిమా ను పూర్తి చేసిన కృష్ణంరాజు ఆ తర్వాత చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు.
షూటింగ్ సమయం లో ఇబ్బంది పడ్డా కూడా కమిట్ అయ్యాం కనుక చేయాల్సిందే అనట్లు ఆ సినిమా ను పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతుంది.
ప్రభాస్ మరియు కృష్ణంరాజు కలిసిన నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది, అయినా కూడా కృష్ణం రాజు యొక్క పాత్ర కు మంచి మార్కులు పడ్డాయి.
అంధుడైన కూడా జ్యోతిష్యం పై పట్టుదలతో అద్భుతమైన ప్రతిభ తో తన శిష్యులకి పాఠాలు బోధించి మంచి మార్గంలో నడిపించాడు.
అందుకే సినిమా లో కృష్ణం రాజుకి మంచి గుర్తింపు దక్కింది.ఆ సినిమా సమయంలోనే అనారోగ్యం సమస్యలు కూడా పెరగడంతో కృష్ణం రాజు మృతి చెందినట్లుగా కొందరు భావిస్తున్నారు.
వీడియో: సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణిస్తున్న యూఎస్ మహిళకు షాక్..