ప్ర‌జారాజ్యం పార్టీకి ఒక్క ఎంపీ సీటు రాలేదుగా.. మ‌రి అప్ప‌ట్లోనే ప‌వ‌న్ కి ఎలా సాధ్యం..!!

నేను త‌లుచుకుంటే.నేను అనుకుంటే.

అంటూ మొద‌లు పెట్టే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ను త‌ల‌చుకోవ‌ద్ద‌ని ఎవ‌ర‌న్నారో మాత్రం ఎప్ప‌టికీ చెప్ప‌రు.

వాస్త‌వానికి ప‌వ‌న్ ఒక్కో స‌భ‌.స‌మావేశాల్లో ఒక్కోతీరులో మాట్లాడ‌తారు.

తాజాగా పవన్ స్వాతంత్ర వేడుకల సంద‌ర్భంగా పార్టీ సమావేశంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తన గతాన్ని జ‌న‌సైనికుల‌కు గుర్తు చేశారు.అదేంటంటే నేను తలచుకుంటే.

2009లోనే ఎంపీ అయ్యేవాడిని అంటూ లాంగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పేశారు.అన్న చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో ప‌వ‌న్ యువరాజ్యం అధినేతగా ఉన్నప్పటి ముచ్చ‌ట‌.

నిజంగా పవన్ ఆనాడు ఎందుకు పోటీ చేయాలనుకోలేదో తెలియదు కానీ ఉమ్మడి ఏపీలో మొత్తం 42 సీట్లలో చాలా మంది అభ్యర్థులు ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు.

అయితే ఏ ఒక్కరూ కూడా ఎంపీగా గెల‌వ‌లేక‌పోయారు.కానీ.

ప్రజారాజ్యం పార్టీకి 70 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి.h3 Class=subheader-styleనాడు ఎంపీగా ఎవ‌రూ నెగ్గ‌లేదు.

/h3p అలాగే 18 దాకా ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి.ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.

చిరంజీవి రెండు సీట్లకు పోటీ చేస్తే సొంత జిల్లా పశ్చిమ గోదావరి పాలకొల్లులో ఓడిపోయారు.

అదే తిరుపతిలో మాత్రం గెలిచారు.ఇదీ ప్రజారాజ్యం రాజకీయ చరిత్ర.

మరి పవన్ తాను 2009లోనే ఎంపీ అయ్యేవాడిని ఇప్పుడు అంటున్నారు.నాడు చిరంజీవి ఊపుని చూసి పీఆర్పీ తప్పక అధికారంలోకి వస్తుందని భావించి నాటి టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు ఆ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ నుంచి కూడా అనేక చోట్ల నేతలు పార్టీ మారి పోటీ చేశారు.

అంటే నాయకుల బలానికి ఏమీ లోటు లేదు ఇటు చిరంజీవి గ్లామర్ కీ తిరుగులేదు.

కానీ ఒక్క ఎంపీ కూడా గెల‌వ‌లేక‌పోయారు.మరి ఈ చేదు నిజం పవన్ ప‌వ‌న్ కి గుర్తులేదా.

నాడు ఎంపీగా పోటీ చేస్తే గెలిచేవాడిని అని ఎలా అంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

పైగా 2019 ఎన్నికల ఫలితాలు చూస్తే రెండు చోట్లలో పవన్ పోటీ చేసి ఓడిపోయారు.

"""/"/ ఇక ఏపీ అంత‌టా అభ్య‌ర్థులంద‌రికీ ప‌వ‌న్ ప‌రిస్థితే ఒక్క సీటు త‌ప్పా.

అయితే ఎంపీ కంటే ఎమ్మెల్యేగా గెలవడం సులువు.పైగా జనసేన తొలిసారి బరిలోకి దిగింది.

పవన్ ఊపు కూడా ఉంది.అయినా సరే ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా పవన్ గెలవలేదు కదా.

అని ప్రత్యర్థులు విమ‌ర్వ‌లు మొద‌లు పెట్టారు.ఇక ఏడు అసెంబ్లీ సీట్లు కలిస్తే ఒక ఎంపీ సీటు.

మరి ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పవన్ తాను ఎపుడో ఎంపీ అయ్యేవాడిని అని చెప్పడం ఏంట‌ని.

సెటైర్లు వేస్తున్నారు.చేదు నిజాన్ని త‌లుచుకుని పవ‌న్ జ‌న‌సైనికుల‌కు ఏం చెప్పాల‌నుకుంటున్నాడో ఏంటో.

?.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 7, సోమవారం 2025