ఉన్నప్పుడు వస్తే అసలు సినిమా ఏంటో చూపిస్తా..!: మంత్రి పువ్వాడ
TeluguStop.com
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు.
తన చేతుల్లో ఓడిపోయి ఐదేళ్లకు ఒక పార్టీ మారతారని విమర్శించారు.ఇంటిలో ఖాళీగా కూర్చున తుమ్మల నాగేశ్వర రావును కేసీఆర్ పిలిచి ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
అనేక పదవులు కట్టబెట్టినా కేసీఆర్ ను తుమ్మల మోసం చేశారని ఆరోపించారు.2018లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు కత్తులు దూసుకొని తొమ్మిది సీట్లలో ఓడించారన్నారు.
తాను ఖమ్మంలో లేని సమయంలో బందిపోటు దొంగల్లా వచ్చి ముగ్గురు కార్పొరేటర్లను లాక్కున్నారని మండిపడ్డారు.
తాను ఉన్నప్పుడు వస్తే అసలు సినిమా ఏంటో చూపిస్తానన్నారు.ఈ క్రమంలో గుంట నక్కల్లా వ్యవహారించే వారికి బుద్ది చెప్తామని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!