రామ్ చరణ్ లోకేష్ కాంబో లో సినిమా వచ్చేది ఎప్పుడంటే..?

మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ( Ram Charan)వరుసగా పాన్ ఇండియా సబ్జెక్ట్ లను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు.

ఇక ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తూ ముందుకు కదులుతున్నాయి.

ఇక ఇలాంటి క్రమం లోనే రామ్ చరణ్ లొకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి.

"""/" / నిజానికి లోకేష్ విక్రమ్ సినిమా తర్వాతే రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలి కానీ అది ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు.

ఇక నిజానికి లోకేష్ కనక రాజ్( Lokesh Kanakaraj ) కూడా అప్పుడు చాలా బిజిగానే ఉన్నాడు.

కానీ రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల అప్పుడు ఆ కాంబో అనేది సెట్ అవ్వలేదు.

ఇంకా ఇప్పుడు మరోసారి వీళ్ళ పేరైతే చాలా గట్టిగా వినిపిస్తోంది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శంకర్, బుచ్చి బాబు( Buchi Babu Sana) లతో చేస్తున్న చరణ్ ఆ తర్వాత సుకుమార్ లో కూడా చేయాల్సి ఉంది.

ఇక ఆ తర్వాత లోకేష్ తో ఆయన సినిమా ఉంటుంది అంటూ కొందరు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

"""/" / ఇక లోకేష్ కూడా వరుసగా ఖైదీ 2, విక్రమ్ 2 లాంటి సినిమాలు కూడా చేయాల్సిందే.

ఇక ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు.కాబట్టి ఈ మూడు సినిమాల తర్వాత ఇద్దరు ఫ్రీ అవుతారు.

అప్పుడు వీళ్ళ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది.చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది.

ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రస్తుతం రిలీజ్ కి రెఢీ అవుతుంది.

ధనుష్ రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కథ ఇదేనా..?