మెగా వారసుడు వచ్చే డేట్ ఫిక్స్ అయింది ఎప్పుడంటే..?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్( Ram Charan ) భార్య ఉపాసన( Upasana ) ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు .

సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఉపాసన.వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్నారు.

తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.ప్రెగ్నెన్సీ అనేది ఓ వేడుకలా ఉండాలి.

ప్రస్తుతం ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా అని వెల్లడించారు.ఇక ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ( Dr Pratap C Reddy )మనమరాలు అయిన ఉపాసన.

2012లో రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుంది .శోభ కామినేని, అనిల్ కామినేని( Shobha Kamineni, Anil Kamineni ) దంపతుల రెండో కుమార్తె అయిన ఉపాసన.

"""/" / చిన్న వయసు నుంచే వ్యాపార లావాదేవీలను చూసుకోవడం మొదలుపెట్టింది .

ఓ పక్క బిజినెస్ చూసుకుంటూనే, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉపాసన కొణిదెల ( Upasana Konidela )మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్న ఉపాసన .అందుకు సంబంధించి పలు విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంది .

ఇక తాజాగా మరింత గుడ్ న్యూస్ మెగాభిమానులకు అందించింది .తనకు జులైలో ప్రసవం కానుందని ఉపాసన స్వయంగా చెప్పుకొచ్హిండి .

ప్రతి తల్లిదండ్రుల లాగానే మేం కూడా ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నాం’ అని ఉపాసన పేర్కొన్నది .

అలాగే తను గర్భంతో ఉన్నప్పుడు భర్త రామ్ చరణ్ ఎంత సపోర్ట్ చేశాడో కూడా తెలిపింది.

"""/" / పుట్టబోయే బిడ్డకు పూర్తి స్వేచ్చని ఇస్తాం.దాంతో పాటు గైడ్ లైన్స్, బాధ్యతలు కూడా ఉంటాయి.

ఎందుకంటే కొన్నిసార్లు స్టార్‌డమ్‌తో పాటు కొండంత బాధ్యత కూడా వస్తుంది.దాని విలువ దానికి ఇవ్వాల్సిందే అని పేర్కొంది .

గర్భంతో ఉన్నప్పటికీ ఉపాసన తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంది .

పని చేస్తున్న మహిళలకు తను మార్గదర్శిగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపింది .మీ జీవితంలో తల్లి కావడం అనే భాగం కొత్తగా ఎందుకు ఉండాలిఅని ఉపాసన ప్రశ్నిస్తుంది .

తమ పిల్లల జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా ఎక్కువ మంది మహిళలు ఉద్యోగం ఎలా చేయాలి అనే విషయంలో నేను ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను’అని ఉపాసన చెప్పుకొచ్చింది.