కార్తీక పౌర్ణమి ఎప్పుడు.. కార్తీక పౌర్ణమిరోజు ఎలా పూజ చేయాలి?

మన హిందూ పురాణాల ప్రకారం ఎంతో పవిత్రంగా భావించే కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని ఎంతో పవిత్రమైన రోజుగా ఒక పర్వదినంగా భావిస్తారు.

ఎంతో పవిత్రమైన ఈ కార్తీకమాసం రోజు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను సందర్శించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజుపరమేశ్వరుడు త్రిపుర అనే రాక్షసుడిని సంహరించినాడు కనుక కార్తీకపౌర్ణమినీ త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 19వ తేదీ వచ్చింది.కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజులపాటు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

కార్తీక పౌర్ణమి పూర్ణిమ తేదీ- నవంబర్‌ 18 (గురువారం) రాత్రి 11.55 నుంచి 19 శుక్రవారం మధ్యాహ్నం 02.

25 కు తిథి ముగుస్తుంది.ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి పారుతున్న నదీ జలాలతో స్నానమాచరించి అనంతరం విష్ణుమూర్తి నెయ్యితో దీపారాధన చేయాలి.

అదే విధంగా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల విష్ణువు అనుగ్రహం మనపై ఉంటుంది.

ఆ విష్ణు దేవుడి ఆశీస్సులు పొందాలంటే తప్పనిసరిగా స్వామి వారికి పాయసం నైవేద్యంగా సమర్పించాలి.

"""/"/ కార్తీక దీపం రోజు 365 వత్తులు కలిగినటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా ప్రతి రోజు దీపారాధన చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.

అదేవిధంగా ఈ రోజు దానధర్మాలు చేయడం ఎంతో మంచి పుణ్య ఫలాన్నిస్తుంది.కార్తీక పౌర్ణమి రోజు తులసి మాత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు అందుకోసమే ఈ రోజు విష్ణుమూర్తికి తులసి మాలతో పూజ చేయటం వల్ల మంచి పుణ్య ఫలం దొరుకుతుంది.

నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి ప్లాన్స్ వేస్తున్న బాలీవుడ్ హీరోలు వర్కౌట్ అవుతుందా..?