ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడు.. తెలుగు త‌మ్ముళ్ల ఎదురుచూపు..!

జూనియ‌ర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎంత‌లా ఉంటుందో అందరికీ తెలిసిందే.ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొన‌సాగుతున్నారు.

తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డిగా ఎప్పుడో అనిపించుకున్నారు.సీనియ‌ర్ ఎన్టీఆర్.

తాత డైలాగులు చెప్తూ తెలుగు ఫ్యాన్స్ ని.తెలుగు త‌మ్ముళ్ల‌ని ఖుషీ చేస్తారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావ‌డంతో ఎన్టీఆర్ కు ఎక్కడాలేని ఫేమ్ వచ్చింది.

ఎక్కడ చూసినా ఆయన నటనకు వందకు రెండొందల మార్కులు పడుతున్నాయి.ఆయన స్టార్ డమ్ ఇంకా రెట్టింపైంది.

మ‌రి ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటే బాగుంటుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నారు.

ఎప్పుడెప్పుడు టీడీపీలోకి వ‌స్తాడా అని ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే విజ‌యం త‌ప్ప‌నిస‌రి అని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు.

కాగా పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలన్న డిమాండ్లు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

గత ఏడాది చంద్రబాబు కుప్పం పర్యటనలో స్థానిక కార్యకర్తలే ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు.

ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు కూడా చిన్న రాముడిని తీసుకురావాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు.

ఇటీవ‌ల బాబు ప‌ర్య‌ట‌న‌లోలో కూడా జై ఎన్టీఆర్ అంటూ బ్యాన‌ర్లు క‌ట్టారు.బాబు ఎదురుగానే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

దీంతో బాబు కొస్తా ఇబ్బంది ప‌డిన‌ట్లు క‌నిపించింది కూడా.ఎన్టీఆర్ కి ఇంట్రెస్ట్ ఉందా.

? H3 Class=subheader-styleగ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్నారా.?/h3p """/"/ అస‌లు ఎన్టీఆర్ ఏమ‌నుకుంటున్నారు.

? అయితే జూనియ‌ర్ ఎక్క‌డ కూడా పార్టీ ప్ర‌స్తావ‌నే తేవ‌డం లేదు.ఎప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడినా సినిమా విష‌యాల వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు.

అభిమానుల నుంచి పార్టీలోకి రావాల‌ని బ‌లంగా వినిపించినా ఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటూ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు.

ఇక రీసెంట్ గా జరిగిన బింబిసారా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ వ్యాఖ్య‌లు ఆస‌క్తి క‌లిగించాయి.

స్పీచ్ లో తన తండ్రి హరిక్రిష్ణను అలాగే తాత ఎన్టీఆర్ ని తలచుకున్నారు త‌ప్పితే ఎక్క‌డా కూడా త‌న బాబాయ్ బాల‌య్య బాబు ప్ర‌స్తావ‌నే తేలేదు.

మా కుటుంబాన్ని మూడు తరాలుగా ఆదరిస్తున్న అభిమాన దేవుళ్లు అంటూ మాట్లాడారు.అయితే తండ్రితో పాటు బాబాయ్ ని త‌లుచుకునే ఎన్టీఆర్ బాల‌య్య పేరు ఎందుకు ప్రస్థావించలేదు అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది.

గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. """/"/ ఇదిలా ఉంటే జూనియర్ ని టీడీపీ తరఫున ప్రచారానికి పిలుస్తారు అని కూడా చర్చ సాగుతోంది.

మరి అక్కడ బాలయ్య, లోకేష్ ఉంటారు క‌దా.వ‌స్తాడా లేదా.

అన్న‌ది కూడా ప్ర‌శ్నే.ఇక చంద్రబాబు రంగంలోకి దిగి జూనియర్ ని ఆహ్వానిస్తేనే వ‌స్తారు త‌ప్పితే.

ఎన్టీఆర్ స్వ‌యంగా అయితే రావాల‌నుకోర‌నే చెప్పాలి.అయితే ఎన్టీఆర్ ను తీసుకురావాలన్న డిమాండ్లపై చంద్రబాబు ఇప్ప‌టికీ మౌనంగానే ఉన్నారు.

బాలకృష్ణ కూడా ఎవర్నీ పిలవమని పలుసార్లు చెప్పిన విష‌యం తెలిసిందే.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!