Hanuman Jayanti : ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఎప్పుడు..? ఆరోజు పాటించాల్సిన నియమాలు ఏంటంటే..?

ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఆపద్బాంధవుడిగా, భయంగా ఉన్నప్పుడు అభయాన్ని ఇచ్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు.

హిందువులు పూజించే ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయస్వామి( Anjaneya Swamy ) కూడా ఒకరు.

ప్రతి ఒక్క ఊరిలోను తప్పనిసరిగా ఆంజనేయస్వామి ఆలయం ఉంది.ఏటా చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి( Hanuman Jayanti ) జరుపుకుంటారు.

ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం నాడు వచ్చింది.

హనుమంతుడికి ఇష్టమైన రోజు మంగళవారం.అలాంటి మంగళవారం లేదా శనివారం రోజు హనుమాన్ జయంతి వస్తే దానికి ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుంది.

"""/" / హనుమాన్ జయంతి నాడు దేశవ్యాప్తంగా ఆంజనేయస్వామి ఆలయాలను కాషాయ రంగు జెండాలతో అలంకరిస్తారు.

అలాగే ఆరోజు హనుమంతుడు ఆశీస్సుల కోసం సుందరకాండ ( Sundara Kanda )కూడా పఠిస్తారు.

రామనామ జపం కూడా చేస్తారు.దానధర్మాలు చేస్తారు.

హనుమంతుడు అనుగ్రహంతో మనిషి అన్ని రకాల సమస్యల నుండి బయటపడతాడు.అంజనీ మాత గర్భం నుంచి జన్మించినందుకు ఆయన్ని ఆంజనేయులుగా పిలుస్తారు.

శని పట్టని దేవుళ్లలో హనుమంతుడు కూడా ఒకరు.హనుమంతుడి అనుగ్రహం పొందడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా( Hanuman Chalisa ) పఠించాలి.

దీన్ని జపించడం వలన మనసులోని భయాలు అన్ని తొలగిపోతాయి. """/" / దుష్టశక్తుల ప్రభావం కూడా మీద ఉండదు.

ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు.అలాగే హనుమంతుడి అనుగ్రహం కోసం సుందరకాండ పారాయణం చేయాలి.

హనుమాన్ జయంతి రోజు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.హనుమాన్ జయంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి.

ఆ రోజు ఉపవాసం ఉంటే ఆంజనేయస్వామి అనుగ్రహం లభిస్తుంది.పసుపు లేదా ఎరుపు రంగులో దుస్తులు ధరించడం శుభప్రదంగా కూడా భావిస్తారు.

హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ విగ్రహానికి తమలపాకులు సమర్పించాలి.అంతేకాకుండా సింధూరంతో విగ్రహాన్ని అలంకరించాలి.

హనుమంతుడికి ఇష్టమైన బెల్లం, పప్పు నైవేద్యంగా సమర్పించాలి.

ప్రశాంత్ వర్మ వైఖరి ఏంటో అర్థం కావడం లేదంటున్న విమర్శకులు… అసలేం జరిగింది..?