ఈ సంవత్సరం చిత్రగుప్తుడి నోము ఎప్పుడు.. పూజ ప్రాముఖ్యత గురించి తెలుసా..?
TeluguStop.com
హిందూ ధర్మంలో నోములు, వ్రతాలు, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అయితే నోములను చేసే ముందు కచ్చితంగా చిత్రగుప్త నోముని( Chitragupta Nomu ) చేసుకోవాలి.
అప్పుడే మిగిలిన నోములను చేయాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.దీంతో చిత్రగుప్తుని పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
దీపావళి రెండో రోజు యమ తృతీయ రోజున చిత్రగుప్తుడు పుట్టిన రోజుగా జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ జరుపుకున్న రెండవ రోజున చిత్రగుప్తుడి పూజను జరుపుకుంటారు.
బ్రహ్మ తనయుడు చిత్రగుప్తుడు ( Chitragupta )యమధర్మ రాజుకి సహాయకుడిగా హిందువుల నమ్మకం అని చెబుతున్నారు.
ఎందుకంటే మరణాంతరం మానవుల మంచి, చెడుల గురించి చిత్రగుప్తుడు మాత్రమే యమ ధర్మరాజుకి చెబుతాడని విశ్వాసం.
"""/" /
ఎవరు స్వర్గానికి వెళ్ళాలో, ఎవరు నరకానికి వెళ్ళాలో భగవంతుడు, చిత్రగుప్తుడు మాత్రమే నిర్ణయిస్తాడు.
చిత్రగుప్త పూజను ప్రత్యక్షంగా మహిళలు, కాయస్థ కుటుంబం నిర్వహిస్తూ ఉంటుంది.ఈ రోజున పుస్తకాలు, పెన్నులను పూజించే సంప్రదాయం ఉంది.
ఆచారాల ప్రకారం చిత్రగుప్తుల్ని ఆరాధించడం ఈ రోజున ఆయనను స్మరించడం వల్ల పనిలో పురోగతి, తెలివితేటలు పెరిగే వరం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
చిత్రగుప్తుని ఆరాధనలో పుస్తకం, పెన్నకి చాలా ప్రాముఖ్యత ఉంది.ఈ సంవత్సరం చిత్రగుప్త పూజ, తేదీ, పూజ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసంలోని( Kartika Masam ) శుక్లపక్షం రెండవ రోజున చిత్రగుప్త పూజలు జరుపుకుంటారు.
ఈ పండుగ జరుపుకునే తిధి నవంబర్ 14 మంగళవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల 36 నిమిషాలకు మొదలై మరుసటి రోజు నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 02:36 నిమిషములకి ముగుస్తుంది.
ఈ తిధి ఉన్న రోజుల్లో రాహుకాలం తప్ప ఏ శుభ సమయంలోనైనా చిత్రగుప్తుని పూజించవచ్చు.
చిత్రగుప్త పూజకు నవంబర్ 15 తేదీన మధ్యాహ్నం 01:47 నిమిషముల వరకు శుభ సమయం ఉంది.
చిత్రగుప్తుని పూజకు అనువైన సమయం ఉదయం 10 గంటల 48 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల వరకు ఉంటుంది.
అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి 6.36 నిమిషాల వరకు అమృతకాల ముహూర్తం ఉంటుంది.
అలాగే మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషంలో నుంచి 4.28 నిమిషముల వరకు రాహుకాల సమయం ఉంటుంది.
చిత్ర గుప్తా పూజ రోజున తెల్లవారు జామున నిద్ర లేచి స్నానం చేసి చిత్రగుప్తుడు యమరాజుల చిత్రపటాన్ని ఒక వేదిక పై ఉంచి ఆచారాల ప్రకారం పుష్పాలు, అక్షతలుతో పూజించాలి.
భారత్‌లో పాకిస్థానీ వ్యక్తి.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే?